Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభPrabhas: అతని పెళ్లి తర్వాతే నా పెళ్లి..!

Prabhas: అతని పెళ్లి తర్వాతే నా పెళ్లి..!

- Advertisement -

Prabhas : ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ప్రభాస్ అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. 40 ఏళ్ళు దాటేసినా ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. ఇప్పుడు లైన్లో పెట్టిన సినిమాలన్నీ పూర్తి కావాలంటే ఇంకో నాలుగేళ్లు పట్టేస్తుంది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని అంతా ఎదురు చూస్తున్నారు.

ఇటీవల ప్రభాస్ బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఆహా అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. దీంతో ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అది చాలా సరదాగా సాగింది. ఇందులో ప్రభాస్ తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

బాలయ్య ప్రభాస్ తో.. ఇటీవల శర్వానంద్ వచ్చాడు షోకి, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగితే ప్రభాస్ చేసుకున్నాక చేసుకుంటాను అని చెప్పాడు. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావు అని అడిగాడు. దీనికి ప్రభాస్ వాళ్ళు అలా చెప్తే నేను సల్మాన్ ఖాన్ పేరు చెప్పాలేమో. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నాక నేను చేసుకుంటాను అయితే అని అన్నాడు. దీంతో ఇక ప్రభాస్ పెళ్లి అయినట్టే అని అభిప్రాయపడుతున్నారు అంతా. గతంలో అనుష్కని, ఇటీవల కృతి సనన్ ని పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చినా అవి గాసిప్స్ లాగే మిగిలిపోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News