బేతంచెర్ల మండలం ఆర్ బుక్కాపురం గ్రామ రైతులు వానలు కురువాలని శనివారం నాడు ధైవ భక్తి భజన పాటలు పాడుతూ, బుక్కాపురం గ్రామం నుండి పాదయాత్ర చేసుకుంటూ ఆర్ కొత్తపల్లె చేరుకొని ఆ గ్రామ రైతులతో, భజన బృందంతో కలిసి ఊరిలో భక్తి పాటలతో భజనలు చేయుచు అంబాపురం చేరుకున్నారు. అంబాపురం గ్రామంలో ఎపి రైతుసంఘం మండల ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ ఆధ్వర్యంలో అంబాపురం గ్రామంలో, రైతులతోకలిసి భజన పాటలు ఆలపిస్తూ పాదయాత్ర చేస్తూ ఆర్ఎస్ రంగాపురంలో, తదనంతరం రహిమాన్ పురం చేరుకొని వర్షం కురువాలని గంగమ్మకు పూజలు చేశారు. శనివారం ఒకేరోజు 5 గ్రామాలలో ధైవ భక్తి పాటలతో భజనలు చేయుచూ పాద యాత్రను రహిమాన్ పురంలో ముగించారు. ఈ కార్యక్రమంలో బుక్కాపురం భజన బృందం సభ్యులు నాగేషు, మద్దిలేటీ నాటుడు,, తలారి నాగ మద్దయ్య, ముళ్లగుర్తి మాధవస్వామీ, తిమ్మయ్య, రామళ్లకోట మద్దయ్య, చల్ల రామచంద్రుడు, గోకారి, చిన్నపుల్లయ్య, తలారి సునీల్ విష్ణువర్ధన్, వెంకట రమణ, అంబాపురం అనీల్, తిమ్మయ్య, నాగశేషులు, కొత్తపల్లె రంగాపురం రహిమాన్ పురం భజన బృందాలు 5 గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Bethamcharla: వానల కోసం రైతుల భజనలు, పాదయాత్రలు
చినుకు లేక ఎండుతున్న పంటలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES