కరోనాకు ముందు కరోనాకు తర్వాత ప్రపంచంలోని ప్రతి రంగంలో అనేక రకాలైన మార్పులు చోటుచేసుకున్నాయి. మరి ముఖ్యంగా విద్యారంగంలో చెప్పలేనటువంటి మార్పులు వచ్చాయి. 2020 వ సంవత్సరం నుండి 2022 వరకు ప్రపంచస్థాయిలో అంతకంటే ఎక్కువగా భారతదేశ విద్య వ్యవస్థలో అనేక విధాలైన సాంకేతిక పరిజ్ఞానం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ రెండు సంవత్సరాలపాటు పాఠశాలలు తెరవకపోవడం ఆన్లైన్ విద్య విధానం అమలుపరచడం విద్యార్థిని విద్యార్థులు సెల్ ఫోన్స్ లో ల్యాప్టాప్‌లో పాఠాలను వినడం హోంవర్క్స్ రాయడం ఈ సాంకేతిక విధానాల ద్వారా విద్యార్థులు సెల్ ఫోన్స్‌కి ఎక్కువగా అలవాటు పడటం అసలు విద్యను విద్యను అందించే ఉపాధ్యాయులను వారి మీద గౌరవ మర్యాదలను మరిచిపోయి విద్యార్థులు తమ ఇష్టాను రాజ్యముగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరుణంలో తరగతి గదిలో ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రస్తుతం ఉన్న విద్యా హక్కు చట్టాలు కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండటం విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేపట్టే పరిస్థితి ఉపాధ్యాయులకు లేకపోవడం విద్యార్థులు వారి యొక్క హావభావాలు వేషధారణ మొత్తానికే మార్పు వచ్చింది. విద్యార్థులు మాట్లాడే మాటలలో వారు వేసుకునే వస్త్రాలలో సినిమా హీరోల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. నేటి విద్యార్థులను మందలించి వారికి విద్య నేర్పించడం ఒక మహా యుద్ధంగా మారింది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సహకారం కూడా ఉండటం వారిపై ఎలాంటి చర్యలు చేపట్టలేని పరిస్థితి ఈతరం విద్యార్థులు వారు చేస్తున్న వింత చేష్టలు తరగతి గదిలో స్థితిగతులను మార్చేస్తుంది. ఒక ప్రముఖ తెలుగు ఉపాధ్యాయుడు ప్రముఖ రచయిత కవి పద్య సాహితీవేత్త శ్రీపాద రామచంద్రయ్య గారు తాను కలము నుండి జాలువారిన పద్య శతకం వినరా బిడ్డా! రామచంద్రయ్య గారు తెలుగు సాహిత్యంలో అనేక రకాలైన కవిత లు కథలు రాసి నేటితరం విద్యార్థులకు తనదైన శైలిలో పద్య సాహిత్యంలో వినరా బిడ్డ అనే బాల సాహిత్యాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇంకా సాహిత్యంలోకి వెళితే నేడు ప్రముఖ రచయితలు రాస్తున్న కవితలు కథలు వ్యాసాలు, సాధారణ భాషలో సాహిత్యంతో ముడిపడి ఉంటే శ్రీపాద రామచంద్రయ్య గారు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రముఖమైన సాహితీ ప్రక్రియ పద్య సాహిత్యాన్ని అత్యంత సులువుగా సాధారణ విద్యార్థులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగు సాహితీ పద్య పరిమళాలను వినరా బిడ్డ అనే శతకం ద్వారా అందించటం మనకు ఎంతో గర్వకారణం. ఒక్క సారి పద్యాలలోకి తొంగి చూస్తే ఎంతో అర్ధాన్ని ఆంతర్యాన్ని ఇచ్చేటటువంటి పద్యాలు రాశారు. పసివయసున నీ వింతయు/విసుగు కొనక నేర్చు విద్య విలువను పెంచున్/సగల విద్యను గరపక/ పసరములే దిగుట నిల పాడియో బిడ్డా/ చిన్నతనములో నీవు కొంచెం కూడా విసుగు పడకుండా నేర్చుకునే విద్య విలువలను పెంచుతుంది సారంగల విద్య నేర్చుకోకుండా పశువులాగా తిరగడం లోకంలో న్యాయం కాదు.
తల్లిదండ్రుల మాట వినక/బలిసిన దున్నవలె దిరుగు బహు మూర్ఖుడున్/ఇలలో సుతుడై పుట్టిన/తల్లిదండ్రి వెతలు వెలుపుట తరమా బిడ్డా!/ఓ బిడ్డ తల్లిదండ్రుల మాట వినకుండా బలిసిన దున్నపోతుల తిరిగి బహు మూర్ఖుడువు కొడుకుగా ఈ లోకంలో కుడితివి ఆ తల్లిదండ్రుల కష్టాలను తెలపడం సాధ్యం కాదు.
రాదని శిలవలే నుండకు/వాదము సలపక చదివిన వడిగా వచ్చున్/మోదము బెరుగును జిలికిన/రాదే వెన్నయు వెలికి రయ మున బిడ్డా!/చదువు రాని రాయల కూర్చునక పెరుగును చిలికి వేయగా వెన్న వస్తుంది కదా చదివినను చదువు వస్తుంది అని కవి భావన.
తిరిపెము నెత్తి నొకనాడు తిరుగుచు లేమిన్/చిరుగులు ఫ్యా షన్ నెడని/పరుగిడు ధరించి/ మనుజుడ భళిరా బిడ్డా!/ఓ పాలక ఒకప్పుడు చిరిగిన వస్త్రములు ధరించి బిచ్చమునెత్తుకునే వారు ఇప్పుడు అవే చిరిగిన దుస్తులు ధరించి ఫ్యాషన్ అని పరుగు పెడుతున్నారు తెలుసుకోరా బాలకా అని కవి అభిప్రాయం.
సంపద లెన్నియు నున్నను/సొంపుగా హిమము వలె గరుగు జూచుచు నుండన్/నింపాదిగా పొందు చదువు/సంపాదించిన నిధియగు సత్యము బిడ్డా!/ఓ బిడ్డ సంపదలు ఎన్ని ఉన్నా చూస్తుండగానే మంచుల సమృద్ధిగా కరిగిపోతాయి కానీ చదువు మాత్రము తరగని సంపద అని కవి విద్యార్థిలకు తెలియజేస్తున్నాడు.
అందము గలవాడైనను/ వందకోట్ల ధనము గలవాడైనను/ సుందర శోభిత విద్యను/ పొందని వాడిలా వికారపు నరుడు బిడ్డా!/ఓ బాల విద్యార్థి అందగాడవైనను వందకోట్ల ధనమున్న వాడువైనను అందముగా ప్రకాశించే విద్యను పొందని వాడు ఇలలో వికారపు మానవుడు.
భారత భూమిన పుట్టిన/వారల జన్మలు తరించు వాసిగ/ నిలలో పారినతగల దిచ్చుట/ నేరుపుతో నేర్చువాడే నేర్పరి బిడ్డా!/ భారతదేశంలో జన్మించుట గొప్ప ముక్తి ఇక్కడ జన్మించిన వారికి సంపూర్ణ జ్ఞానము కలదు ఆ జ్ఞానమును సార్ధకతతో నేర్చుకొనుట సమర్ధుల వల్లే సాధ్యమవుతుంది అని కవి అభిప్రాయం.
సెల్లున్నది చేతులలో/ సొల్లున్నది దానినిండ జూచిన నెపుడున్/ చెల్లును చదువుకు నీకున్/ చెల్లని నోరుగుదు వివు శ్రేష్టుమె బిడ్డా!/చేతిలో సెల్లు ఉన్నది దానితో సొల్లు వేయకు దానివల్ల సమాజంలో నీకు పనికిరాని చెల్లుబాటుగాని నోటుగా మారతావు అని కవి భావన.
సినిమా హీరో వేషము) సినిమా వరకే తగినది చెల్లదు బయటన్/ అనుకరణ వలదు చేటగు/ అనుకరణచే/ చెడును నక్క అటవీన బిడ్డా!/సినిమాలో హీరో వేసే వేషము ఆ సినిమా వరకే విలువనిస్తుంది బయట ఆవేశం చెల్లదు నీవు ఆ వేషమును అనుకరిస్తే కీడుగలుగుతుంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకొని చనిపోయింది గమనించరా విద్యార్థి.
రక్షణ లేదిట గురువుకు/శిక్షణ నిచ్చుట తరించే శిష్యులకి ప్పుడన్/ శిక్షణ నిరంతరము నివ్వగ/ శిక్షించిరనుచు నరిచేడి శిష్యులు బిడ్డా!/ పాఠములు చెప్పే గురువులకు నేడు రక్షణ లేదు పాఠము చెప్పే గురువులనే శిక్షించే శిశువులు ఉన్నారు నేటి సమాజంలో తెలుసుకో విద్యార్థి.
ఎంతయు చదివినగాని/ ఎంతయొ సంపద కలిగిన నేవి ఫలించే /నింతయు నింగిత జ్ఞానము/ ఇంతయు సంస్కృతి నెరుగని ఎడ్డకు బిడ్డా!/ఎంత గొప్ప చదువులు చదివిన ఇంగిత జ్ఞానం నాగరికత తెలియని వాడికి చదువు సంపద ఉన్న ఎలాంటి లాభము ఉండదు విద్యార్థి తెలుసుకో అని కవి అభిప్రాయం.
తింటే బలమగు నటులన్/ వింటే శాస్త్రము తెలియును విద్యలు దెలియున్/ ఉంటే వినయము నీకడ/అంటున్ జ్ఞానము సకలము నపుడు బిడ్డా!/ఇంతే శక్తి వస్తుంది వింటే శాస్త్ర విద్యలు తెలుస్తాయి నీవు వినయంగా ఉంటే మొత్తం జ్ఞానం వస్తుంది అని కవి భావన. కవి శ్రీపాద రామచంద్రయ్య గారు ఎంతో శ్రమించి పరిశ్రమించి శోధించి తెలుగు సాహిత్యాన్ని పరిశీలించి నేటి విద్యా ర్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వినరా బిడ్డ శతకాన్ని రచిం చారు ఈ పద్యాలు నేడితరం విద్యార్థులకు సులభమైన జ్ఞానాన్ని విద్యను వినయాన్ని అందిస్తాయి అనుటలో ఎలాంటి సందేహము లేదు రచయిత శ్రీపాద రామచంద్రయ్య గారు ప్రముఖ కవి సినీ గేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మరియు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరావు గారు అభినందనలను అందుకోవటం ఎంతో ప్రశంసనీయం. శ్రీపాద రామచంద్రయ్య గారి కలం నుండి మరి ఎంతో చైతన్యవంతమైన రచనలు రావాలని కోరుకుందాం.
- పూసుపాటి వేదాద్రి,
కవి సాహితీ విశ్లేషకులు,
9912197694