పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ ఎస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు బిఆర్ ఎస్ లో చేరుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వారంతా పని చేస్తూ, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేస్తామని ప్రతిన బూనుతున్నారు. తాజాగా, పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం కొరిపెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు డోనాల కరుణాకర్, ఎర్ర నర్సయ్యలతోపాటు, తొర్రూరు మండలం పెద మంగ్యా తండా లో వార్డ్ మెంబెర్ జాటోత్ దేవా, జాటోత్ జితేందర్, జాటోత్ నిమ్మ, జాటోత్ నారాయణ, జాటోత్ హేమని, జాటోత్ నంద లు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి, బిఆర్ ఎస్ పార్టీ లో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో వాళ్ళంతా మంత్రి నాయకత్వంలో పని చేస్తామని ప్రతిన బూనారు. వారికి గులాబీ కండువాలు కప్పి బిఆర్ ఎస్ పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆహ్వానించారు.
పోలేపల్లి నుంచి…
అలాగే తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన 15 కాంగ్రెస్ కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరాయి. పర్వతగిరిలో మంత్రి సమక్షంలో వాళ్ళంతా చేరారు. ఆ గ్రామానికి చెందిన తండా సోమయ్య, తండా కిష్టయ్య. తండా రామస్వామి, నామాల ముత్తయ్య. బేతమల్ల వెంకటయ్య, ఏనుగంటి యాకయ్య, ధారావత్ రవి, పూజారి భిక్షం, తండా వెంకన్న, ధరావత్ శీను, ఏనుగంటి రమేష్, పందుల వెంకటయ్య, పందుల పకీరు, పందుల వెంకన్నతదితరుల కుటుంబాల వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ చేరికలకు మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామ సహాయం కిషోర్ రెడ్డి, కాకిరాల హరిప్రసాద్, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పిటిసి మంగళ పళ్లి శ్రీనివాస్, గ్రాగ పార్టీ అధ్యక్షుడు గజ్జి యాకయ్య, సర్పంచ్ పందుల యాకయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ అంకూస్, మండల నాయకులు పులి వెంకన్న, ధరావత్ భాస్కర్, పులి సతీష్ లు ఈ చేరికలకు ఆధ్వర్యం వహించారు.
పార్టీలో వారికి సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పాటు పడాలని సూచించారు. కాగా, తాము రాష్ట్రంలో సిఎం కెసిఆర్, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై బిఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయానికి పని చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, గ్రామ నాయకులు, ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.