హిందువులకు ప్రధాన పండుగలలో ఒకటైన వినాయక చవితి కోసం వివిధ రూపాలలో ఉండే గణపతి విగ్రహాలు అమ్మకానికి సిద్ధమయ్యాయి. చాగలమర్రి మండలంలోని ఆయా విగ్రహాల తయారీ శ్రీ చైతన్య భారతి పాఠశాల వెళ్ళే సమీపంలో ఆకర్షణీయ ఆకృతులలో గణపతి విగ్రహాలను విక్రయాలకు సిద్దంగా ఉంచారు. గతేడాది మట్టి విగ్రహాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు కూడా అధికంగానే విక్రయాలు జరిగాయన్నారు. పర్యావరణాన్ని కాపాడుదాం , మట్టి విగ్రహాలను పూజిద్దాం అనే నినాదంతో ప్రజలలో కొన్ని సంఘాలు చైతన్యం తీసుకువచ్చాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల మూలంగా నష్టం వాటిల్లుతుందని ప్రచారం కూడా పిఓపి విగ్రహాల అమ్మకాలపై ప్రభావం చూపింది. దీంతో ముందుగా వచ్చిన ఆర్డర్లకు కూడా విగ్రహాలను విక్రయిస్తున్నామని తెలిపారు.వినాయక చవితికి కేవలం మూడు రోజుల పాటు జరుగుతూ ఉండటంతో పెద్ద విగ్రహాలతోపాటు చిన్న విగ్రహలను కూడా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. వాడవాడలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ.
Chagalamarri: విక్రయానికి సిద్ధంగా గణనాథులు
పలు రూపాల్లో చూడ ముచ్చటగా ఉన్న విగ్రహాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES