Kangana Ranaut : తన సినిమాలతో, తన వ్యాఖ్యలతో ఏదో ఒక విధంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. కాంట్రవర్సీలతోనే బాగా పాపులర్ అయింది ఈ బాలీవుడ్ భామ. గత కొన్నేళ్లుగా కేవలం కంటెంట్ ఓరియెంటెడ్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుంది కంగనా.
ప్రస్తుతం 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో అప్పటి పరిస్థితులని చూపించడానికి ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకి కంగనానే నిర్మాత, దర్శకురాలిగా వ్యవహరించడం విశేషం. ఇందులో ఇందిరా గాంధీ పాత్రని కూడా కంగనానే పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా అప్డేట్స్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది కంగనా.
అయితే తాజాగా ఈ ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ కి లోక్సభ సెక్రటేరియట్ ముందు షూట్ చేస్తాము, పర్మిషన్ కావాలంటూ లోక్సభ సెక్రటేరియట్ ఉన్నతాధికారులకు లేఖ రాసింది కంగనా రనౌత్. సాధారణంగా లోక్సభ సెక్రటేరియట్ లో గాని, ఆ చుట్టూ పక్కల పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తుల వీడియో, కెమెరాలకు ప్రవేశం లేదు. ఎటువంటి షూటింగ్స్ కి అనుమతి కూడా లేదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన దూరదర్శన్ వాళ్లకి మాత్రమే అనుమతి ఉంది.
మరి కంగనా అడిగిన అనుమతిని ఒప్పుకొని రూల్స్ బ్రేక్ చేసి మరీ లోక్సభ సెక్రటేరియట్ ముందు షూటింగ్ కి అనుమతిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అనుమతి ఇచ్చే అవకాశం ఉండదని అక్కడి ఉన్నతాధికారులు అంటున్నారట. మరి ఇప్పటి ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలిచే కంగనాకి అక్కడ షూటింగ్ కి అనుమతి ఇస్తారో లేదో చూడాలి.