సింగప్పగూడ గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ శంకుస్థాపన చేసిన భూగర్భ గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామంలో సిసి రోడ్ల అభివృద్ధి కోసం మరో 30 లక్షలు మంజూరు చేశామని బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం మంత్రిగా తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కెసిఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమ ప్రదాత అని బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పేదల పక్షపాత ప్రభుత్వమని దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే అన్నారు.
పేదల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రతి పౌరునికి అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణా జలాలతో గ్రామ ప్రజల గొంతు తడిపిన ఘనత ఆయన అన్నారు. మిషన్ భగీరథ మంచి నీరు వచ్చాక గ్రామాలలో నీటి కొరత లేదన్నారు. మిషన్ కాకతీయ పథకంతో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. పల్లె పకృతి వనాలతో రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిందన్నారు. వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులు బోదకాలు ఎయిడ్స్ బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఘనత కేసీఆర్ అన్నారు. ఇంతటి ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం చేవెళ్లలో గ్రంధాలయ భవన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ లు పార్టీ సీనియర్ నాయకులు ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు రైతు సమన్వయ సమితి నేతలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.