దేవదాయ శాఖ, శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి దేవస్థానం, ఆర్.ఎస్.రంగాపురం గ్రామం, బేతంచెర్ల మండలం, నంద్యాల జిల్లా, దేవస్థానమునకు వచ్చు భక్తులు, శ్రీ స్వామి అమ్మవార్లకు సమర్పించిన ముడుపులు కానుకల హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పాండురంగారెడ్డి మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ బి. సీతారామ చంద్రుడు ఆధ్వర్యంలో దేవదాయ శాఖ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరెడ్డి సమక్షంలో దేవస్థాన ధర్మకర్తలు టి.లక్ష్మీ నాయుడు, ఆర్.రామచంద్రుడు, ఎం.లక్ష్మీదేవి, ఎం.సుశీల, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆర్.ఎస్.రంగాపురం సిబ్బంది మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు, 29/5/2023 నుండి 28/8/2023 వరకు అంటే 90 రోజులు హుండీ లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు.
ఈ లెక్కింపు ద్వారా( రూ 79,71,105/-) డెబ్భై తొమ్మిది లక్షల డెబ్భై ఒక వెయ్యి నూటఐదు రూపాయలు నగదు, 27 గ్రాముల 800 మిల్లీగ్రాములు బంగారు, 3 కేజీల 500 గ్రాములు వెండి దేవస్థానమునకు ఆదాయం వచ్చినదని శ్రీ మద్ది లేటీలక్ష్మీ నరసింహ స్వామి దేవ స్థానం కార్యనిర్వాషణ అధికారి డి. పాండు రంగారెడ్డి, మద్ది లేటీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బి. సీతారామచంద్రుడులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, దేవస్థానం పాలక మండలి సభ్యులు,వేద పండితుల బృందం పాల్గొన్నారు.