రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్(జిపిఎస్) అమలుకు సంబంధించి వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది.
ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖా మాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్, రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు ఆదిమూలపు సురేశ్, (ప్రభుత్వ సలహాదారు ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్ ఆర్) చిరంజీవి చౌదరి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శులు డా.కె.వివి. సత్యనారాయణ, ఎన్.గుల్జార్ పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నుండి ఎపి ఎన్జీవో సంఘం జనరల్ సెక్రటరీ శివారెడ్డి, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఆస్కార్ రావు, సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాజేశ్, నాబ ప్రసాద్, యుగంధర్, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.