Monday, September 30, 2024
Homeపాలిటిక్స్Shadnagar: 'ఆలుగడ్డ' మాములోడు కాదుగా

Shadnagar: ‘ఆలుగడ్డ’ మాములోడు కాదుగా

వీర్లపల్లి శంకర్ - ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ మధ్య పోటీ

నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో అందరూ అతన్ని సామాన్య నాయకుడు అనుకున్నారు.. అతడికి టికెట్ వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడితే ఏఐసీసీ టికెట్ల పరిశీలనలో షాద్ నగర్ పట్టణానికి చెందిన యువ నాయకుడు ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పేరు పరిశీలనకు రావడం ఇప్పుడు కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టికెట్ తనకే వస్తుంది అధిష్టానంలో తనకు పరిచయాలు ఉన్నాయి అంటూ ఈ మధ్యకాలంలో మీడియా ముందు పలు సందర్భాల్లో ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ మాట్లాడారు. ఈ విషయాన్ని అందరూ తేలిగ్గానే తీసుకున్నారు. తాజాగా టికెట్ల రేసు విషయానికి వచ్చేసరికి ఏఐసిసి వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో అనూహ్యంగా ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పేరు పరిశీలనకు రావడం గమనర్హం. టికెట్ వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడితే ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పేరు ఏఐసిసి పరిశీలనకు రావడమే గొప్ప విషయంగా ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు.

- Advertisement -

కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు వీరే..

షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అధిష్టానం దరఖాస్తు నియమాన్ని పెట్టింది. దీనికి స్పందించిన ఆశావాహులు షాద్ నగర్ నియోజకవర్గం నుండి పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, పిసిసి సభ్యులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, టిపిసిసి మాజీ రాష్ట్ర కార్యదర్శి ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దంగు శ్రీనివాస్ యాదవ్, ఎన్ఎస్ యుఐ నాయకుడు దినేష్ సాగర్, ఇటీవల సస్పెన్షన్ కు గురైన మేకగుడ సర్పంచ్ పాండురంగారెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ పార్లమెంటరీ అద్యక్షుడు కె. పురుషోత్తం రెడ్డిలు అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోటీ మాత్రం వీర్లపల్లి శంకర్, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ మధ్య ఉంటుందని నియోజకవర్గ ప్రజలు, పార్టీ భావించింది. అయితే కాంగ్రెస్ దరఖాస్తుల వడపోత కార్యక్రమంలో అనూహ్యంగా వీర్లపల్లి శంకర్ పేరుతో పాటు ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పేరు పరిశీలనకు రావడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.
ఏదో సినిమాలో నటుడు రావు రమేష్ రావు మాట్లాడుతాడు రాజకీయాలకు సంబంధించి, తనకు ఎదురొచ్చిన పిల్ల నాయకుడి గురించి ఇలా ప్రస్తావిస్తాడు.. అసలు అతని వ్యాసార్థం ఎంత? ఘనపరిమాణం ఎంత? పొడవు, వెడల్పు ఎంత? అసలు వాడి కథ ఎంత అంటూ రావు రమేష్ డైలాగ్ విసురుతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పరిస్థితి ఊహించుకుంటే అందరికీ ఇదే దిమ్మతిరిగేలా ఈ డైలాగ్ గుర్తొస్తుంది. సీనియర్ నాయకుల పేర్లు కాకుండా ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పేరు తెరపైకి రావడం జాతీయ, రాష్ట్ర మీడియాలో కూడా పరిశీలనలో పేర్లు వెలువడడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

గతంలోనే ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ టిపిసిసి అధ్యక్షుడిగా ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్ర కార్యదర్శి పదవిని తీసుకున్నారు. అప్పుడే అందరు ఆశ్చర్యాన్ని గురయ్యారు. ఈ మధ్యకాలంలో ఏఐసిసి నాయకుడు బికె హరి ప్రసాద్ కొసం కర్ణాటకకు తరచూ వెళ్లి కలుస్తున్నాడు. సదరు ఏఐసిసి నాయకుడి సిఫారసుతో ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పేరు మాత్రం పరిశీలనకు రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఢిల్లీ నుండి కవర్ వస్తే అందులో ఏమి వస్తుందో కూడా ఇప్పటివరకు రాజకీయాల్లో ఎవరికీ తెలియని అంశం అది అందరికీ తెలిసిందే. ఇక ఈ విషయమై సిటీ టైమ్స్ ప్రతినిధి ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ తో మాట్లాడితే ఖచ్చితంగా టికెట్ తనకు వస్తుందని తన పేరు పరిశీలనలో ఉందని అన్నారు. అలాగని తాను వీర్లపల్లి శంకర్ కు వ్యతిరేకం కాదని శంకరన్న చాలా మంచివాడు అంటూ చెప్పుకోచ్చారు. నేను కూడా టికెట్ అడుగుతున్నాను ఇస్తే పోటీ చేస్తాను గెలుస్తాను. అది స్థానం శంకరన్నకు టికెట్ ఇచ్చిన పని చేస్తాను అంటూ తన మనసులోని మాట చెప్పాడు. ఇక యాదవ, కురువ సామాజిక వర్గంలో తనకు ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News