Friday, September 20, 2024
HomeతెలంగాణRasamai: దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్

Rasamai: దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్

పెన్షన్ మంజూరి పత్రాలను పంపిణీ చేసిన రసమయి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సాయిరాం గార్డెన్స్ లో తిమ్మాపూర్ మండలంలోని దివ్యాంగులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ మంజూరి పత్రాలు పంపిణీ చేసిన రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ..
దివ్యాంగుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడని, దివ్యాం గులకు పెన్షన్ మరింతగా రూ. 4016 లకు పెంచి దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దివ్యాంగులకు నూతన పెన్షన్ తో పాటు గృహలక్ష్మి పథకం కింద ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు అందజేస్తామని, దివ్యాంగులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని, బీసీ బంధు, దళిత బంధు వంటి పథకాలను కూడా వర్తింప చేస్తామని, ఈ పెన్షన్ ద్వారా తిమ్మాపూర్ మండలం దాదాపు 1300 మంది లబ్ధి పొందుతున్నారని, నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 10000 మంది వరకు దివ్యాం గులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఇను కొండ జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ రావుల రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News