Friday, September 20, 2024
HomeతెలంగాణMallareddy: సింగరేణిలో రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలి

Mallareddy: సింగరేణిలో రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలి

మంత్రి మల్లారెడ్డిని కలిసిన సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్

సింగరేణిలో రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డిని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రేణులు కోరారు. ఈ మేరకు మంత్రి నివాసంలో చౌదరి గూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు ఆధ్వర్యంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళ వందార్ వేణు మాధవ్, కె.వి.లక్ష్మణ చార్యులు కలిసి సింగరేణి అభివృద్ధి ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పుడు వైద్య, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ తదితర ఏరియాల్లో సింగరేణి రిటైర్డ్ కుటుంబాలు జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మొదలైన ప్రాంతాల్లోని ఎంపానెల్డ్ ఆసుపత్రుల ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత, అపరిమిత వైద్య సదుపాయాలను అందించాలని, మెడికల్ కార్డ్ హోల్డర్‌లకు కేటాయించిన కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికేర్ స్కీం ఫండ్ నుండి నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఛార్జీలను రికవరీ చేయకుండా సింగరేణి హాస్పిటల్స్‌లో ఉచితంగా చికిత్స చేయాలన్నారు. హైదరాబాద్ కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగులు మందుల కోసం సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న కొత్తగూడెం, గోదావరిఖని, భూపాలపల్లి, మందమర్రిలలో ఉన్న సింగరేణి దవాఖానల నుంచి మందులు తీసుకోవడం చాలా కష్టంగా ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు అత్యవసర సమయాల్లో ఎంపానల్డ్ హాస్పటల్స్ లో చికిత్స పొందిన తరువాత సమర్పించిన మెడికల్ బిల్లుల క్లియరెన్స్ కోసం, పదవీ విరమణ పొందిన వారికి వర్తించే కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్డ్ మెడికేర్ స్కీం పథకం ప్రకారం 45 రోజుల్లో పరిష్కరించాలని సింగరేణి సింగరేణి చెర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేయాలని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల తరుపున మంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి సిఎం కేసీఆర్ కు లేఖ వ్రాయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్, కె.వి.లక్ష్మణ చార్యులు, చెట్టి రాములు గౌడ్, బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ భాను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News