Sunday, October 6, 2024
HomeదైవంBhadrakalam in Rakhi: రాఖీ పండుగ ఎలా జరపాలి? భద్రకాలం అంటే?

Bhadrakalam in Rakhi: రాఖీ పండుగ ఎలా జరపాలి? భద్రకాలం అంటే?

రాఖీ పండుగ ప్రాముఖ్యత రాఖీ పండుగ రోజే భద్ర కాలం

- Advertisement -

తెలుగుప్రభ ప్రత్యేక కథనం

రాఖీ పండుగ రోజే భద్ర కాలం కావున ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. భద్ర కాలం అని ఎందుకు పిలుస్తారు? అసలు ఈ సమయంలో రాఖీ కడితే ఏమవుతుంది? శూర్పణఖ భద్ర కాలంలో ఆ రావణాసురునికి రాఖీ కట్టింది. రావణసురుని సామ్రాజ్యం మొత్తం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. ఈ భద్ర కాలంలో శూర్పణఖ తన యొక్క సోదరుడైన లంకేశుడు కూడా రాఖీ కట్టింది. ఆ తరువాతనే ఆ రావణాసురుని లంక చెడు దశ ప్రారంభమైంది. ఆ రావణాసురునికి దురదృష్టం మొదలైందని చెబుతారు. రాఖీ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు శ్రావణ పూర్ణిమ రోజున ఉదయం రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున బ్రాహ్మణులు మరియు వైశ్యులు జంధ్యం ఆచరించే వారు తమ పాత జంద్యము మార్చుకుంటారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా కొత్త జంధ్యము ధరిస్తారు. ఈ జంద్యము ఉదయాన్నే మార్చుకుంటారు. 2023 రాఖి పండుగ రాఖీ పౌర్ణమి రోజున భద్ర కాలం. పొరపాటున కూడా మీ యొక్క సొదరులకు ఈ సమయంలో రాఖీ కట్టకండి. శ్రావణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ అంటారు. ఆ రోజున అందరూ రాఖీ పండుగ జరుపుకుంటారు. ఇది శ్రావణ మాసంలో, వస్తుంది. దీన్ని శ్రావణ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం రాఖీ పూర్ణిమ 2023 ఆగస్టు 30న లేదా 31న? ఏ రోజు సరైన రోజో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ రోజున భద్ర పూర్ణిమ తిథితో పాటు భద్ర కూడా జరుగుతోంది. కాశీ జ్యోతిష్యం పండిత నిపుణుల పంచాంగం ప్రకారం రాఖీ పూర్ణిమ తిథి ఆగస్టు 30 ఉదయం 10.58 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు ఆగస్టు 31 ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. అలాగే ఈసారి భ్రదునినీడ కమ్ముకుంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. ఈసారి ఇది ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు ఉంటుంది.
మరి రాఖీ కట్టుకోవడానికి సరైన సమయం ?
30 వ తేది రాత్రి 9.01 నుంచి మరుసటి రోజు 31 ఉదయం 7.05 వరకు రాఖీ కట్టుకోవచ్చు. రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? రాఖీ పౌర్ణమి పండుగ అన్న చెల్లెల ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు అందరు తమ యొక్క సోదరులకు రాఖీ కట్టి, వారికి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువును ఇవ్వాలని కోరుకుంటారు. ఈ రోజున రాఖీ కట్టుకునే సమయంలో మహిళలు కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. రక్షాబంధన్ ఏ సమయంలో జరుపుకోవాలి? మన హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ పండుగ శుభ సమయంలో చేయడం ప్రయోజనకరం అని చెబుతున్నారు. రాఖీ పండగ సందర్భంగా మార్కెట్లో రంగురంగుల రాఖీలు అమ్ముతుంటారు. అయితే రాఖీ కట్టేటప్పుడు సోదరిమణులు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారి సోదరుల చేతి మణికట్టు కి ఎలాంటి రాఖీ కట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ కట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు సోదరిమణులకు తమ యొక్క సోదరులకు రాఖీ కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొనే రాఖీ పైన ఎలాంటి అశుభ సంకేతాలు ఉండకూడదు. రాఖీలు విభిన్న డిజైన్లతో మార్కెట్లో దర్షనమిస్తాయి. సాధారణంగా ఇలాంటి రాఖీలు పిల్లలకు కనపడితే వారు వాటికి ఆకర్షితులు అవుతారు. కానీ అది శుభప్రదం కాదు.
రాఖీ కట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు మీరు మీ తొడ పుట్టిన వారికి రాఖీ కడుతున్నారా? ఐతే కట్టేటప్పుడు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. రాఖీ పండుగను మన హిందూ మహిళలు చాలా సంతోషంగా జరుపుకుంటారు. తమ యొక్క సోదరుడు ఎంత దూరంలో ఉన్న కూడా ఈ రోజున మాత్రం వారి దగ్గరకు వెళ్లి మరీ రాఖీ కడతారు. సోదరులు కూడా తమ అక్కా, చెల్లెళ్ల పట్ల చాలా ప్రేమను చూపిస్తారు, వారి కష్టాల్లో తోడుగా ఉంటారని. రాఖీ పున్నమి గురించి చాలామందికి అనేక ప్రశ్నలు తరచుగా సతమతానికి గురిచేస్తుంటాయి. రాఖీని ఏ దిశలో కూర్చుని కట్టాలి, రాఖీని ఎంతకాలం చేతికి ఉంచుకోవాలి, రాఖీ ఎప్పుడు తీయాలి మరియు రాఖీ పాడైపోతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మన భారతీయ హిందూ పండితులు చక్కగా వివరణ ఇచ్చారు.

రక్షా బంధన్ ఆచారాన్ని ఎలా నిర్వహించాలి?

  1. రాఖీ కట్టేటప్పుడు సోదరుడు తూర్పు ముఖంగా కూర్చోవాలి అని పండితులు వివరించారు.
  2. రాఖీ కడుతున్న సోదరి పడమర లేదా ఉత్తర ముఖంగా ఉండాలి.
  3. మన హిందూ మతంలో ఏమైనా శుభ కార్యం చేసే ముందు ఆ రోజున దిశ మరియు శుభ సమయం చూస్తారు. రాఖీ పున్నమి నాడు రాఖీ కట్టేటప్పుడు సోదరుడు యొక్క ముఖం తూర్పు దిశలో ఉండాలి. అలాగే రాఖీ కట్టే సోదరి పడమర లేదా ఉత్తరం దిశలో ఉండాలి. అప్పుడు ఎవరికీ దక్షిణం వైపు ఎదురుగా ఉండకూడదు. ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. పండితులు చెబుతున్నారు.
  4. రాఖీ కట్టిన తర్వాత కొన్ని రోజులు సోదరుడు ఆ రాఖీ ని చేతికి పెట్టుకోవాలి. అలా అని ఎక్కువ రోజులు ఉంచుకోకుడదు. రాఖీని ఎక్కువ రోజులు ఆ రాఖిని చేతికి ఉంచుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారు.
  5. అలా చేతికే రాఖిని ఉంచుకుంటే సోదరుడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చాలా రోజులు రాఖీని చేతిలో పెట్టుకోకూడదనుకుంటే కృష్ణ జన్మాష్టమి రోజు రాఖీని తొలగించుకోవచ్చు లేదా రాఖీని ఎప్పుడూ ఒక పవిత్రమైన రోజు మాత్రమే చేతి నుండి తీసివేయాలి.
  6. రాఖీని సోదరుడు చేతికి చాలా రోజులు కట్టుకోవడం వల్ల అది విరిగిపోతుంది. అలా విరిగిన రాఖీని చేతి మణికట్టు మీద ఉంచకూడదు. అలా ఉంచుకోవడం అశుభంగా భావిస్తారు.
  7. ప్రవహించే నీటిలో ఆ రాఖిని వేయాలి. విరిగిన వస్తువులు మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఉండడం వలన మీ ఇంట్లోకి . ప్రతికూల శక్తులు వస్తాయి.
  8. చాలా మంది రాఖీని విరిచి అక్కడక్కడ వేస్తారు. అలా అస్సలు చేయకూడదు.
  9. ఆ రాఖీని ఎరుపు రంగు గుడ్డలో చుట్టి మీరు పూజ చేసే పవిత్ర స్థలంలో ఉంచాలి.

తెలుగుప్రభ పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు రాఖి పూర్ణిమ శుభాకాంక్షలు

వ్యాసం :హరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News