Jammu and Kashmir: జమ్ము–కాశ్మీర్‌లో భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపాయి. జమ్మూలోని షోపియన్ జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తీవ్రవాదులు నిషేధిత సంస్థ లష్కర్–ఇ–తైబాకు అనుబంధంగా పనిచేస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తీరవాదుల్ని పోలీసులు గుర్తించారు.
వీరిని లతీఫ్ లోనె, ఉమర్ నజీర్‌గా గుర్తించారు. కాశ్మీర్ లోయలో ఇటీవల హత్యకు గురైన శ్రీ పురాణ క్రిష్ణ భట్ హత్యలో లతీఫ్ ప్రధాన నిందితుడు. ఉమర్ నజీర్ నేపాల్‌లో జరిగిన తిల్ బహదూర్ర తాపా హత్యలో ప్రధాన నిందితుడు. మృతుల దగ్గరి నుంచి ఒక ఏకే–47 గన్, రెండు పిస్టోల్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు పోలీసులు తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ముంఝ్ మోర్గ్ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు తెలిపారు.
మరోవైపు జమ్ము–కాశ్మీర్‌లో తీవ్రవాద సంస్థలకు సంబంధించిన ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. వివిధ ప్రదేశాల్లో సీజ్ చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు పైనే ఉంటుంది. తీవ్రవాదుల సంస్థల కార్యకలాపాలను అడ్డుకునే ఉద్దేశంతో, వాటి ఆదాయ వనరుల్ని సీజ్ చేస్తున్నారు అధికారులు.