Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Vemula: కేసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ది

Vemula: కేసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ది

సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవు

కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై మోర్తాడ్ మండలం కేంద్రం సుంకేట్, షెట్పల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు, తటస్థులు-వేల్పూర్ మండలం పోచంపల్లి, జానకం పెట్, అక్లూర్ కాంగ్రెస్, బిజెపిల నుండి కమ్మర్పల్లి వడ్డెర సంఘం సభ్యులు సుమారు 1000 మంది రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ…
కొంత మంది డబ్బులు ఇస్తామన్న పోతలేరు..కానీ మీరు స్వచ్చందంగా వచ్చి కేసిఆర్ కి తనకు మద్దతుగా రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. మీ రాకతో తనకు మరింత బలాన్ని పెంచారని వారికి హృదయ పూర్వక స్వాగతం పలికారు. అభివృద్ది వైపే ఉంటామని రావడం మంచి మార్పుకు నాంది అని అన్నారు. ఎలక్షన్లు రాగానే కొంత మంది ఊర్ల మీద వచ్చి పడి అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తారని,ఓట్లు డబ్బలో వేసుకున్నాక మొహం చాటేస్తన్నారని అన్నారు. ఉదాహరణ 5 రోజుల్లో పసుపు బోర్డు పేరుతో గెలిచిన అర్విందే అని అన్నారు. అట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని, సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని తేల్చి చెప్పారు.

ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 1000 కోట్లు ఆర్ అండ్ బి రోడ్లు,100 కోట్ల సి.సి రోడ్లు,100 కోట్లు కుల సంఘ భవనాలు,150 కోట్లతో చెక్ డ్యాంలు నిర్మించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో బాల్కొండ నియోజకవర్గాన్ని మరింత అభివృధ్ది చేసుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్,బీజేపీ అసత్యాలు నమ్మొద్దని..మోసపోతే గోసపడతామని అన్నారు. కేసిఆర్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ది పై ప్రతి గ్రామంలో,ప్రతి ఇంట్లో చర్చ జరగాలని కోరారు. కేసిఆర్ సర్కార్ సంక్షేక కార్యక్రమాలు ప్రతి గడపకు వివరిస్తూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల పార్టీ నాయకులు,ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News