పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్పా ఎస్టేట్ , శివన్న నగర్ లో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు. వైసిపి నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తో కలిసి అర్బన్ హెల్త్ సెంటర్లు ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రభుత్వం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న యూహెచ్‌సీ భవనాలకు మెరుగులు దిద్దడంతో పాటు కొత్త సెంటర్ల ఏర్పాటు కోసం భవనాలను నిర్మిస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో వీర శైవ లింగాయిత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, కమిషనర్ గంగిరెడ్డి, డిఈ మనోహర్ రెడ్డి,టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజశేఖర్, వైసిపి నాయకులు నాగేసప్ప, రియాజ్, సుధాకర్ రెడ్డి,అమాన్,ప్రతాప్ రెడ్డి,డిస్ కేశవ రెడ్డి, యూకే వీరేంద్ర, వడ్డే వీరేష్, బీఎన్ నాగరాజు, యుకే రమేష్ పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని గంజెళ్ల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్విని ఆయుర్వేద స్పెషాలిటీ హాస్పటల్ ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కే చెన్నకేశవ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మండల విద్య అధికారి (ఎంఈఓ) ఆంజనేయులు కుమార్తె డాక్టర్ జీ విద్యరాణి (బీఏఎంఎస్, ఎండి) ఏర్పాటు చేసిన ఆసుపత్రిని చెన్నకేశవ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో జనాభా వేగంగా పెరుగుతుంది. జనాభాకు తగిన విధంగా వైద్య సేవలు చేయడానికి డాక్టర్స్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. మెరుగైన వైద్యంతో సకాలంలో స్పందించి సేవలు అందించే వైద్యులను ప్రజలు ఆదరిస్తారన్నారు ఎమ్మెల్యే. ఇటువంటి వైద్యులకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఎంపిపి గొల్ల కేశన్న, ఎంఈఓ ఆంజనేయులు, వైద్యులు డాక్టర్ గౌడప్ప గౌడ్, నవీన్, మాల కొండయ్య, వైసిపి నాయకులు వడ్డే వీరేష్ పాల్గొన్నారు.