Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు

Kurnool: ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు

విధులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు.
1) కర్నూలు పట్టణ డిఎస్పీ విజయ శేఖర్ ,
2) కర్నూలు ఒకటవ పట్టణ సిఐ నాగ శేఖర్ ,
3) స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సై మౌలాలి ,
4) స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సాధిక్
కర్నూలు పట్టణంలో ఎలాంటి మత పరమైన సంఘటనలు జరగకుండా అన్ని వర్గాల వారితో మమేకమౌతూ కర్నూలు పట్టణంలో శాంతి సామరస్యం వెదజల్లెవిధంగా కృషి చేసినందుకు అభినందించారు.
జిల్లాలో పండుగలు, ర్యాలీలు, సమావేశాలు, వివిఐపి సమావేశాలలో ముందుచూపుగా, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలిపారు.
కర్నూలు పట్టణంలో ఇటీవల బక్రీదు, రంజాన్ తదితర పండుగలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకున్నారు. రాబోయే రోజులలో జిల్లా ప్రజలందరూ వినాయచవితి వంటి అన్ని పండుగలను, ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో కలిసి మెలిసి చేసుకుంటూ సోదరభావంతో మెలగాలని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ టి. సర్కార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్, కర్నూలు త్రీ టౌన్ సిఐ మురళీధర్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఎస్సై చంద్రకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News