Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri Chai: కుల్హాద్ ఛాయ్ టేస్ట్ చేయండి

Chagalamarri Chai: కుల్హాద్ ఛాయ్ టేస్ట్ చేయండి

తందూరి చాయ్ ఉంటే ఫుల్ జోష్

మొన్నటి వరకు ఉత్తర భారతదేశంకే పరిమితం అయిన తందూరి చాయ్‌ ఇప్పుడు సౌత్‌ ఇండియాలో కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే యువకుడు సరికొత్తగా పెట్టాడు. సొంత ఊర్లోనే ఉంటూ సరికొత్తగా ఆలోచించి కుండ (టీ ) చాయ్ ఇస్తూ అందరినీ ఆక్టట్టుకుంటున్నాడు.

- Advertisement -

చాగలమర్రి గ్రామంలో తందూరి చాయ్ అడ్రస్ : నంద్యాల జిల్ల చాగలమర్రి గ్రామంలోని బైపాస్ రోడ్ లో ఉండే మిర్చి ఢాబా ఆవరణంలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల టీ స్టాల్స్‌లో ఈ తందూరి చాయ్‌ను ఇస్తున్నారు. విభిన్నమైన రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదవ్వడంతో కాస్త రేటు ఎక్కువ అయినా కూడా కొత్తది అంటూ ట్రై చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తందూరి చాయ్‌ని తాగిన వారు కొత్తగా ఉంది అంటూ అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఆ చాయ్‌ చేస్తున్న విధానం అందరి దృష్టిని ఆకర్షించి ఒక్కసారి తాగాలి అనిపించేలా చేస్తోంది.

మామూలుగా టీ చేస్తారు. ఆ తర్వాత ఒక మట్టి కుండను నిప్పులపై బాగా వేడి చేసి ఆ తర్వాత ఆ టీని మట్టి కుండలో పోస్తారు. దాంతో బాగా మరుగుతుంది. కొద్ది సమయం మరిగిన తర్వాత ఆ టీని మామూలుగా మట్టి కప్పుల్లో లేదంటే ఏదో వేరే గ్లాసుల్లో సర్వ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తందూరి చాయ్‌ వీడియోలు, సోషల్‌ మీడియాను తెగ షేక్‌ చేస్తున్నాయి. తందూరీ చాయ్ దగ్గర్లో దొరక్కపోతే కనీసం ఆ వీడియో అయినా చూసి ఆనందించేద్దాం అన్నట్లుగా ఆసక్తి చూపుతున్నారు. ఏరియాను బట్టి ఒక్క టీ 20 నుండి 50 రూపాయలు తీసుకుంటున్నటున్నారు. చాగలమర్రి గ్రామంలో చాయ్ కేవలం 12/- విక్రయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పీడ్‌గా ఈ తందూరి చాయ్‌ స్టాల్స్‌ పెరుగుతున్నాయి. పెద్దగా పెట్టుబడి లేకపోవడంతో పాటు కొత్తగా ఉందని చాలా మంది ట్రై చేస్తున్నారు కనుక మీకు ఏమైనా ఆలోచన ఉంటే లేదంటే మీ వారు ఎవరైనా టీ స్టాల్‌ నడిపిస్తూ ఉంటే వెంటనే ఈ సలహా ఇవ్వండి. రెండు మూడు వేల అదనపు పెట్టుబడి పెడితే ఈ తందూరి చాయ్‌ స్టాల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News