Saturday, October 5, 2024
HomeతెలంగాణNiranjan Reddy US tour: 3వ రోజుకు చేరుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికా...

Niranjan Reddy US tour: 3వ రోజుకు చేరుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికా టూర్

USDA ప్రతినిధులతో మంత్రి బృందం చర్చలు

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికా పర్యటన 3వ రోజు పరిశోధన రంగంలో USDA (యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్) సహకారం ఆశిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే మా ఆకాంక్ష అన్న మంత్రి.. భావితరాలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకునే బాధ్యత మనపై ఉన్నది ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యుయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాల గురించి మూడో రోజు పర్యటనలో USDA ప్రతినిధులతో మంత్రి బృందం చర్చలు జరిపారు.

- Advertisement -

   ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తొమ్మిదేళ్లలో తెలంగాణ వ్యవసాయం గణనీయమైన పురోగతి సాధించింది ఉపాధి కల్పనలో వ్యవసాయ, దాని అనుబంధరంగాల పాత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు .. అందుకే వ్యవసాయ అనుకూల విధానాలకు పెద్దపీట వేసి రైతులను ప్రోత్సహిస్తున్నారు సమైక్య పాలనలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో సంబరంగా మారింది ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నారు .. రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పూడిక తీసి చెరువులకు మళ్ళీ జలకళ సంతరించుకునేలా చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, పాలామూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీటి గోస తీర్చారు వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నారు.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది ఇప్పడు తెలంగాణలో నీళ్ళు, కరెంట్ పుష్కలంగా ఉండటం, సాగు విస్తీర్ణం పెరగడం, ఉపాధి అవకాశాలు లభిస్తుండడంతో వలసలు ఆగిపోయాయి.. వలస వెళ్ళినవారు తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ని దాటిపోయింది.  భారతదేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా అన్ని కాలాల్లోనూ పంటలు పండించడానికి అనువుగా ఉంటుంది భారతదేశంలో వనరులతో మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు ఆహారాన్ని అందించగలం .. అలాగే విదేశాలకు కూడా ఎగుమతి చేయగలగాలి. నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని మనం భావి పౌరులకు అందించాలి.

  అమెరికా పర్యటనలో భాగంగా మూడవ రోజు  వాషింగ్టన్ డీసి లో ఉన్న NIFA (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్)  సందర్శన .. NIFA డైరెక్టర్, మంజిత్ మిశ్రా, ఇతర అధికారులతో సమావేశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (NIFA) US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) కి చెందిన ఏజెన్సీ.  అమెరికాలో వ్యవసాయాన్ని మెరుగుపరిచే పరిశోధనలు చేయడం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడం, కావలసిన నిధులు సమకూర్చడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పర్యావరణ సమతుల్యత పాటించేలా చూడడం NIFA ప్రధాన లక్ష్యాలు ఈ సమావేశంలో NIFA డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ ఏ దేశంలో అయినా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యం అని, కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకం అని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని,  వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఆర్గనైజేషన్‌లో ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ని కలిశాను అని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు చాలా గర్వంగా ఉందని .. రాష్ట్రంలో పాలన అభినందనీయం అని అభినందించిన NIFA డైరెక్టర్ మంజిత్ మిశ్రా అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలోని NIFA  సందర్శించి, USDA ప్రతినిధులతో చర్చలు జరిపి  NIFA డైరెక్టర్ మంజిత్ మిశ్రాతో భేటీ అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చర్చలలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News