హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో 50 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేడుచర్ల పట్టణంలోని ఎస్సార్ ప్రైడ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలుపు లేకుండా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పైగా సీట్లు గెలుస్తుందని భీమా వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి వంద మందికి ఒక సమన్వయ కార్యకర్త ఉండాలని పేర్కొన్నారు. ప్రతి బూత్ కు వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేయాలన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నియంత్రణ, నిరంకుశ పాలన కొనసాగుతోందని బిఆర్ఎస్ పార్టీని ఓడించే వరకూ పోరాటాలు చేయాలన్నారు. అధికార పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు డబల్ బెడ్ రూమ్, దళితులకు మూడు ఎకరాల భూమి, తదితర హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు, రాష్ట్రంలో ఇకనుండి అధికార పార్టీ భూముల లాక్కోకోవడం, దండాలు చేయడం, ల్యాండ్, మైనింగ్, కమీషన్లు, మోసాలు ఇలాంటివి ఇకముందు జరగవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.
Uttam Kumar Reddy: అధికారంలోకి వచ్చేది మేమే
హుజూర్ నగర్,కోదాడలో 50వేల ఓట్ల మెజారిటీ తగ్గదు