స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం గుర్తించని యాదవులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఎన్నో విధాలుగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేటలోని స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వందల కోట్లు ఇచ్చిన ఇవ్వని రాజ్యసభ సభ్యుడి పదవిని ఒక చాయ్ ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో నాకు ఇచ్చారని గుర్తు చేశారు. ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చేతులమీదుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడంతో పాటు మరో 50 కోట్లు అదనంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి తెచ్చుకున్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీరు అందించడమే కాకుండా మూడు లక్షల ఎకరాలకు సాగనీరు అందిస్తున్నమని అన్నారు. జిల్లా లో ఒక బీసీ బిడ్డకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, జెడ్పి వైస్ చైర్మన్, ఒక జనరల్ స్థానంలో ఎస్సీ మహిళను మున్సిపల్ చైర్మన్ గా నియమించి న ఘనత మంత్రి జగదీష్ రెడ్డి దే అన్నారు. అలాగే మన యాదవ బిడ్డ వట్టే జానయ్య యాదవ్ కు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసీఎంఎస్ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో నియమించడని అన్నారు. తనకు ప్రాణహాని ఉందన్న సమయంలో సైతం మంత్రి జగదీశ్ రెడ్డి గన్మెన్ కూడా ఇచ్చారని అన్నారు. తప్పులు జరిగినప్పుడు మాత్రం నష్టపోయిన వారికి మీ వల్ల కష్టాల పాలైన వారిని కాపాడాలని మంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ని ఓడించాడని, జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిల గెలవనీయట్లేదనే కోపంలో మంత్రి జగదీష్ రెడ్డిని ఇక్కడ ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న కుట్రలో వట్టే జానయ్య యాదవ్ ఇరుక్కున్నాడని అన్నారు. రేపు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మళ్లీ గెలిచేది టిఆర్ఎస్ పార్టీయేనని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాలు గెలుస్తామని అన్నారు.ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా టిఆర్ఎస్ అండగా ఉంటుందని మాయ మాటలు చెప్పేవాళ్లను నమ్మకుండా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో యాదవులమంత కలిసికట్టుగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దావుల వీరప్రసాద్ యాదవ్, మన్నే లక్ష్మీ నరసయ్య యాదవ్, కోడి సైదులు, జటంగి వెంకటేశ్వర్లు, చౌడయ్య యాదవ్, గొద్దేటి సైదులు, కడారి సతీష్ యాదవ్, మట్ట రాజు యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, మండది కృష్ణ, ఆయా మండలాల యాదవ ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు.