Sunday, October 6, 2024
HomeతెలంగాణKhammam: పార్కింగ్ తో కూడిన సోలార్ షెడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

Khammam: పార్కింగ్ తో కూడిన సోలార్ షెడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు

రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాలలో 1.58 కోట్లతో ఎర్పాటు చేసిన 200KW సామర్ధ్యం కలిగిన సోలార్ పార్కింగ్ షెడ్ ను జిల్లా కలెక్టర్ పి వి గౌతమ్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు.

- Advertisement -

ఐడిఓసిలో అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్ కొరకు సోలార్ షెడ్ తోపాటు, 200కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్, గ్రిడ్ కు అనుసంధాన ప్రక్రియను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ గౌతమ్ గార్లతో కలిసి వారు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేసిన ఐడిఓసిలలో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టుగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించామని మనలను ఆదర్శంగా తీసుకుని నేడు పలు కలెక్టరేట్ లు ఖమ్మం విధానంను ఆచరిస్తున్నారు అన్నారు. 200 కిలో వాట్ సోలార్ పవర్ ప్లాంట్ తో రోజుకు 800 నుండి 1000 యూనిట్ల పవర్ ఉత్పత్తి అవుతుందని, ఇట్టి ప్లాంట్ ఉత్పత్తి పవర్ ని ఐడిఓసి అవసరాలకు ఉపయోగించనున్నట్లు, ఐడిఓసి అవసరాలకు పోనూ మిగిలిన పవర్, గ్రిడ్ అనుసంధానంతో గ్రిడ్ కు వెళుతుందని, దీనితో విద్యుత్ నికర వినియోగానికి మాత్రమే బిల్లు వస్తుందని ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన మారో విజయంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News