మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ రూరల్ పిఎస్ సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ నరసింహ ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే ఎలక్షన్స్, గణేష్ పండుగల సందర్భంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, రూరల్ పోలీస్ సిబ్బందితో ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఎస్పీ పేర్కొన్నారు. ఫ్లాగ్ మార్చ్ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై మెట్టుగడ్డ సర్కిల్, ఎస్ ఎస్ గుట్ట, బికె రెడ్డి కాలని మీదుగా భగీరథ కమాన్ వరకు పోలీసు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మహబూబ్ నగర్ జిల్లా శాంతి భద్రతలు పరిరక్షించడానికి, రాబోయే ఎలక్షన్స్, వివిధ పండుగలను (గణేష్, మిలాద్ ఉన్ నబి) పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతపై భరోసా కల్పించడానికి వీధుల గుండా రూట్ మార్చ్ నిర్వహించామన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని .. ప్రజలు, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రూరల్ పోలీస్ సిబ్బంది 40 మందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 70 మంది మొత్తం 110 మంది ఈ ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎస్ పి మహేష్, ఆర్ ఏ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ వి శ్రీకాంత్, రూరల్ సీఐ స్వామి, ఆర్ ఏ ఎఫ్ ఇన్స్పెక్టర్, రూరల్ ఎస్సై లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mahabubnagar: ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ కె నరసింహ
పండుగలు, ఎలక్షన్స్ నేపథ్యంలోనే మార్చ్