Friday, November 22, 2024
HomeఆటIndia vs Bangladesh : రోహిత్‌తో పాటు అత‌డూ దూరం.. బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌

India vs Bangladesh : రోహిత్‌తో పాటు అత‌డూ దూరం.. బీసీసీఐ ప్ర‌క‌ట‌న‌

India vs Bangladesh : భార‌త రెగ్యుల‌ర్ కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ బంగ్లాదేశ్‌తో జ‌రిగే రెండో టెస్టుకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తెలిపింది. బొట‌న‌వేలి గాయంతో బాధ‌ప‌డుతున్న రోహిత్ శ‌ర్మ ఇంకా కోలుకోలేద‌ని, ప్ర‌స్తుతం అత‌డు బీసీసీఐ వైద్య బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని వెల్ల‌డించింది. అత‌డితో పాటు న‌వ‌దీస్ సైనీ సైతం రెండో టెస్టుకు అందుబాటులో లేడ‌ని తెలిపింది. సైనీ పొట్ట‌, తొడ కండ‌రాల నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, అత‌డు జాతీయ క్రికెట్ అకాడ‌మీకి వెళ్లిన‌ట్లు చెప్పింది.

- Advertisement -

రెండో టెస్టుకు సైతం కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని తెలిపింది. రెండో టెస్టు కోసం బీసీసీఐ అప్‌డేట్‌ స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది.

రెండో టెస్టుకు భార‌త జ‌ట్టు ఇదే..

కేఎల్ రాహుల్‌ (కెప్టెన్‌), శుభ్‌మ‌న్‌ గిల్, ఛ‌తేశ్వర్‌ పుజారా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, సౌరభ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.

బంగ్లాదేశ్‌తో రెండో వ‌న్డే సంద‌ర్భంగా రోహిత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో మూడో వ‌న్డేతో పాటు తొలి టెస్టుకు దూరం అయ్యాడు. రెండో టెస్టు నాటికి అందుబాటులోకి వ‌స్తాడ‌ని అనుకుంటే అలా జ‌ర‌గ‌లేదు. ఇక తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై టీమ్ఇండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. రెండో టెస్టులో సైతం విజ‌యం సాధిస్తే ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్లో చోటు ద‌క్కించుకునే అవ‌కాశం మ‌రింత మెరుగుకానుంది. రెండో టెస్టు గురువారం(డిసెంబ‌ర్ 22) నుంచి ఆరంభం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News