Friday, September 20, 2024
HomeతెలంగాణSrinivas Goud: తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో పశుసంపద పెరిగింది

Srinivas Goud: తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో పశుసంపద పెరిగింది

ఇచ్చిన గొర్రెలను ఎట్టి పరిస్థితిలో అమ్ముకోవద్దన్న మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో పశుసంపద పెరిగిందని మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట యాదవ కమ్యూనిటీ హాల్ లో రెండో విడత గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా గొర్రెలు ఇచ్చిందన్నారు. గతంలో కొందరు కుల వృత్తులను అవహేళన చేసేవారని, అలాంటిది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వృత్తులకు గౌరవాన్ని తీసుకువచ్చామని, అన్ని కులాల వారికి వారి కులవృత్తుల ద్వారా లబ్ధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు, చేపలు, కల్లుగీత వంటి పనులను వారికి ఇస్తున్నదని తెలిపారు. గొల్ల కురుమలు కుల వృత్తులను నమ్ముకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను ఎట్టి పరిస్థితిలో అమ్ముకోవద్దని కోరారు. మహబూబ్నగర్లో యాదవ కమ్యూనిటీ హాల్ కు ఎకరం స్థలంతో పాటు, రెండు కోట్ల రూపాయలను త్వరలోనే ఇవ్వనున్నామని, 20 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని హాల్ ను అందంగా నిర్మించుకోవాలని ఆయన సూచించారు. అలాగే హన్వాడ మండలంలో సైతం యాదవ కమ్యూనిటీ హాల్ కు నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.

గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షులు శాంతయ్య యాదవ్, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్ ,మున్సిపల్ చైర్మన్ కే.సీ నరసింహులు, ముడా డైరెక్టర్ సాయిలు యాదవ్ జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News