ఫరూఖ్ నగర్, బండ్లగూడ లలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పట్టాలను పంపిణీ చేసిన హోం మంత్రి మహమూద్ అలీ, ఎం.పి అసదుద్దీన్ ఓవైసీ…. పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించామని హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ జిల్లాలో బహదూర్ పురా నియోజక వర్గంలోని ఫరూక్ నగర్, చాంద్రాయణగుట్ట నియోజక వర్గంలోని బండ్లగూడలో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసితో కలిసి మంత్రి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణి చేసారు.
ఈ సందర్బంగా హోం మంత్రి మాట్లాడుతూ పేదల కోసం ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టించి లబ్దిదారులకు అందించడం పండుగ వాతావరణాన్ని తలపిస్తుందన్నారు. రాండ మైజేషన్ సాఫ్ట్ వెర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి విడతగా ఫరూఖ్ నగర్ లో 500 మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణి చేయడం జరిగిందనీ, అదేవిధంగా, బండ్లగుడ 270 మందికి అందజేస్తున్నామని అన్నారు. పేదల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య, దివ్యంగుల, ఆసరా పింఛన్ల వంటి సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. అన్ని మతాలను ,అన్ని కులాలను, అన్ని వర్గాలను సమానంగా చూసే ముఖ్యమంత్రి మన రాష్ట్ర సీఎం కేసీఆర్ అని హోం మంత్రి అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో మైనార్టీల కోసం 9,163 కోట్ల రూపాయలను వెచ్చించామని తెలిపారు . షాదీ ముబారక్ పథకం కింద 2,225 కోట్ల రూపాయలను అందజేశామని, ఇమామ్ మౌజాన్ల కోసం 301 కోట్ల ను వ్యయం చేయగా ఇటీవల వంద శాతం సబ్సిడీ కింద 100 కోట్ల రూపాయలతో ముస్లింలకు లబ్ధిని చేకూర్చామని వివరించారు.ప్రజల ఆరోగ్య దృష్ట్యా బస్తి దవాఖానల ఏర్పాటు తో పేదవారి కి ఉచిత వైద్యం అందిస్తుందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి అన్నారు. పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి పేదల అభ్యున్నతి కోసం ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తున్నారని ఇది ఎంతో హర్షనియమన్నారు. మొదటి విడతలో ఇల్లు రాని వారు ఆందోళన చెందవద్దని దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఓల్డ్ సిటీ కి కూడా మెట్రో ట్రైన్ వస్తుందని ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బహదూర్ పుర ఎం ఎల్ ఏ. మొహమ్మద్ మొజాం ఖాన్, హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, డి ఆర్ ఓ వెంకటాచారి, ఆర్ డి ఓ సూర్య ప్రకాష్, స్థానిక కార్పొరేటర్లు, తహసీల్దార్లు జయమ్మ, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.