తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల చేయనుంది. రోజుకి 2 వేల టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఈనెల 22 ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది.
ఈ టికెట్ల కొనుగోలు చేయాలనుకునే భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే మహా లఘు దర్శనం లభిస్తుందని టీటీడీ వివరించింది. కాగా.. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం నుండి శ్రీవారిని దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుందని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మిక.