10 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, సొంత గడ్డపై ఆత్మీయులను కలుసుకోవడం ఆనందంగా ఉందని మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మాజీ మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. తన స్వగ్రామమైన నాగారం గ్రామంలో బిజెపి నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో తన తనయుడు ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ నిర్వాహకులు చెన్నమనేని వికాస్ రావు, దీప దంపతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో హృదయవిధారక ఘటనలు చూసి సుష్మా స్వరాజ్ కంటతడి పెట్టి, ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారన్నారు. తెలంగాణ ఆమోద బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అప్పుడు జరిగిన సంఘటనలు ఒక పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలియజేసారు. మోడీ మూడవసారి ప్రధాన మంత్రి కాబోతున్నాడని, ఎర్రకోట నుంచి మోడీ సబ్ కా సత్ సబ్ కా వికాస్ సందేశమిచ్చరని చెప్పారు. భారత దేశాన్ని అభివృద్ధిలో అగ్రగామి చేసిన ఘనత నరేంద్ర మోడీదెనన్నారు. వికాస్ బీజేపీలో చేరుతారని అనుకోలేదని, ప్రతిమ పౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారని కొనియాడారు. టికెట్టు ఎవ్వరికీ ఇచ్చిన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం మోడీ మాటల కోసం చూస్తున్నారన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగడం లేదని, ప్రవాస భారతీయులతో పాటు పక్క దేశస్తులను స్వదేశానికి తెచ్చిన ఘనత మోడిదేనన్నారు.
Chennamaneni Vidyasagar Rao: 10 ఏండ్ల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా
మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు