Friday, November 22, 2024
Homeనేషనల్COVID-19: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్.. అప్రమత్తమైన కేంద్రం తాజా ఆదేశాలివే

COVID-19: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్.. అప్రమత్తమైన కేంద్రం తాజా ఆదేశాలివే

COVID-19: ముగిసిపోయిందనుకుంటున్న కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఈ అంశంపై కేంద్రం ముందుగానే అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటికీ నమోదవుతున్న పాజిటివ్ కేసులపై దృష్టి సారించింది. పాజిటివ్ కేసుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

కోవిడ్ కేసుల విజృంభణపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కోవిడ్ కొత్త వైరస్ గురించి తెలుసుకునే వీలుంటుంది. దీని ద్వారా ఆ రకం వైరస్ నియంత్రించే చర్యలు తీసుకోవడం సులభమవుతుంది. దీంతో కోవిడ్‌ను అదుపు చేయడం తేలికవుతుంది. వైరస్ వ్యాప్తి చేయకుండా చూడొచ్చు. కేంద్రం ఇలా స్పందించడానికి కారణం ఉంది. చైనాలో కోవిడ్ భారీ స్థాయిలో విజృంభిస్తోంది. అమెరికా, బ్రెజిల్, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వారానికి 35 లక్షలకు పైగా కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి.

చైనాలో అయితే, అంచనాలకు అందని స్థాయిలో కోవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. కోవిడ్ కారణంగా అక్కడ భారీ స్థాయిలో రోగులు మరణిస్తున్నారు. చివరకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కష్టమవుతోందంటే చైనాలో కోవిడ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి ప్రభుత్వం కోవిడ్ అదుపు చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. మరో మూడు నెలల్లో చైనా జనాభాలో దాదాపు 60 శాతం మంది కోవిడ్ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. అనేక దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. తాజా ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News