Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddakadaburu: వరుణ దేవుడా కరుణించవా

Peddakadaburu: వరుణ దేవుడా కరుణించవా

వరుణుడు కోసం ఏటి నీళ్లతో దేవాలయాలకు ప్రత్యేక పూజలు

వరుణుడి కోసం స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి తుంగభద్ర నది వద్దకు పాదయాత్ర ద్వారా రాత్రి బయలుదేరి తుంగభద్ర నదీ జలం బిందెతో భక్తిశ్రద్ధలతో ఉదయం 7:00 గంటలకు పెద్దకడబూరు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ ముందు గ్రామానికి చేరుకొని అక్కడినుండి గంగాజలంతో మేళ తాళ వాద్యలతో ఊరేగింపుగా బయలుదేరి ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్లి గంగ పూజలు నిర్వహించి అనంతరం శివుడు దేవాలయం, పెద్ద లక్ష్మమ్మ అవ్వ దేవాలయం, చిన్న లక్ష్మమ్మ అవ్వ దేవాలయం, శ్రీ రామలింగేశ్వర దేవాలయం, శ్రీ మారెమ్మ దేవాలయం, బంగారం అవ్వ దేవాలయం, సుంకులమ్మ అవ్వ దేవాలయం, శ్రీ సిద్ధురుడ స్వామి దేవాలయం, సిద్దేశ్వర స్వామి దేవాలయం, నరసప్ప స్వామి దేవాలయం, దేవమ్మ అవ్వ దేవాలయం, శ్రీ చౌడేశ్వరి దేవాలయం, మార్కండేయ స్వామి దేవాలయం, రామ్ లక్ష్మణ్ దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయం, కురువంజమవ్వ దేవాలయం, చింతల మునిస్వామి దేవాలయం తదితర దేవాలయాల్లో గంగాజలంతో గ్రామ పెద్దలు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా జీవించాలని వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు గంగా జలముతో భక్తులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి బాబు, దిద్దికట్టి బీరప్ప వంద మంది భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News