Saturday, September 21, 2024
HomeతెలంగాణSankarapatnam: చిరుతల రామాయణం గురువు సమ్మిరెడ్డికి సన్మానం

Sankarapatnam: చిరుతల రామాయణం గురువు సమ్మిరెడ్డికి సన్మానం

అంతరించిపోతున్న కళకు ఇంకా జీవం పోస్తున్న గురువు

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జాతీయ గురుపూజోత్సవం సందర్భంగా చిరుతలరామాయణ గురువు (పంతులు) అలివేలు సమ్మిరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనేక సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలలో మరుగున పడిన చిరుతల రామాయణం, ప్రాచీన కళలను ప్రోత్సహించడానికి గురువు అలివేలి సమ్మిరెడ్డి విశేష కృషి చే స్తున్నారు. కరీంనగర్ లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలల్లో జాతీయ తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు కృపాదానం కరీంనగర్ ఆర్డీవో చేతుల మీదుగా సమ్మిరెడ్డి సాంస్కృతిక గురుపూజోత్సవ యోగ్యతా పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రంగస్థలం సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, వంగ సుధాకర్, తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు కృపాదానంతో పాటు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News