Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Kalvakuntla Vidyasagar Rao: కలసికట్టుగా మనమంతా సంజయ్ ను గెలిపించాలి

Kalvakuntla Vidyasagar Rao: కలసికట్టుగా మనమంతా సంజయ్ ను గెలిపించాలి

తన రాజకీయ వారసుడిని గెలిపించాలని కోరిన తండ్రి

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి BRSలో యువకులు ప్రజలు చేరుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని కేఎంఆర్ గార్డెన్స్ లో జరిగిన చేరికల సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మండలంలోని సంగేం శ్రీరాంపూర్, వాల్గొండ, వాల్గొండ తండా, మల్లాపూర్, రాఘవపేట్ గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయేది మళ్లీ మన ప్రభుత్వమేనని జూనియర్లు, సీనియర్లు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో తన వారసునిగా సంజయ్ ని గెలిపించాలని సంజయ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్, బిజెపిలు సోషల్ మీడియా పార్టీలని వారిని ప్రజలు నమ్మేలా లేరని అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యమని విద్యాసాగర్ రావు అన్నారు. నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కెసిఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాల్లో ఎక్కడా లేవని, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ అని, కేసీఆర్ అభివృద్ధి పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని, రాబోయే రోజులలో పర్రి బాటలో నడుస్తూ నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సంజయ్ కుమార్ అన్నారు జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, బి ఆర్ యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News