రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి డిఐజి ఆదేశాల మేరకు జైపూర్ ఏసిపి మోహన్ ఆధ్వర్యంలో జైపూర్ ప్లాంట్ లోని గెస్ట్ హౌస్ లో జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిర్వాంచ పోలీస్ అధికారులుతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించడానికి సమావేశమయ్యారు. ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయం లో జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా, ఎన్నికల ముందు, ఆసమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు, ఇరు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జైపూర్ ఏసీపీ మోహన్, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, సిరువంచ డిఎస్పి సుహాస్ షిండే, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, శ్రీరాంపూర్ సీఐ రమేష్ బాబు, సిరువంచ సిఐ సుదర్శన్ కట్కర్, బామిని సీఐ మదన్ మస్కె, రేగుంట సీఐ కృష్ణ కాటే, వెంకటాపూర్ ఎస్ఐ అజింక జాదవ్, కోటపల్లి ఎస్ఐ సురేష్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు పాల్గొన్నారు.
Telangana-Maha border police meeting: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు పోలీసుల సమావేశం
రానున్న ఎన్నికల నేపథ్యంలో కీలక భేటీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES