Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Atmakur: టిడిపిలోకి భారీగా చేరికలు

Atmakur: టిడిపిలోకి భారీగా చేరికలు

శిల్పాపై మండిపడ్డ బుడ్డా

శ్రీశైలం నియోజకవర్గం, రాష్ట్రంలో అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. 20వ వార్డు నందు వైఎస్ఆర్సీపీకి చెందిన 50 కుటుంబాలు కోయ హోటల్ యజమాని మున్నా ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు ములడుతూ.. శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలో, ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విజనరీ, బుడ్డా రాజశేఖర రెడ్డి అభివృద్ధి చెయ్యాలన్నా తపన నచ్చి కోయ కుటుంబ సభ్యులు, సన్నిహితులు పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 20యేళ్లు వెనక్కి వెళ్లిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సత్తా ఉన్నా నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమేనని విశ్వసించి అనేకమంది పార్టీలో చేరుతున్నారు అని అన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలతో మభ్యపెట్టి ఓట్లు దండు కుని ఓట్లేసిన వైసిపి కార్యకర్తలను, ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. నియోజకవర్గంలో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నంద్యాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హెలికాప్టర్ లో ఎక్కిస్తూ జనాలను దండుకుంటున్నారు అని, అదే విధంగా ఎన్నికల సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డి ప్రజలకు డబ్బుతో జనాలను మభ్యపెడుతానని అన్నారు. ఒక్క అవకాశం పేరుతో ప్రజలు మోసపోయారని మళ్ళీ ఆతప్పు చెయ్యొద్దన్నారు. తెదేపా హయాంలో సిద్దాపురం ఎత్తిపోతల పథకం పూర్తి, ఆత్మకూరు పట్టణానికి ఇంటింటికీ త్రాగునీటి పథకం మంజూరు, ఒక్క ఆత్మకూరు పట్టణంలోని 36కోట్ల తో సి.సి రోడ్లు వేసిన ఘనత తమదేనన్నారు. షాది ఖానా, పక్కా గృహాలు మంజూరు చేసిమని గర్వంగా ప్రజలకు చెప్పగలుగుతున్నామని మరి నాలుగున్నర ఎండ్లలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఏమి అభివృద్ధి చేశారో చెప్పే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ లో చేరికలు మరింతా ఉంటాయని, ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అంతకు ముందు సంగమేశ్వర సర్కిల్ లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంగాల శివరామిరెడ్డి, మాజీ సర్పంచ్ గోవిందా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వేణు గోపాల్, మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్సులు అబ్దుల్లా పురం బాషా, ఫకృద్దిన్, రాజా రెడ్డి, మల్లికార్జున రెడ్డి, నాఘుర్, కలిముల్లా తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News