Saturday, April 19, 2025
HomeదైవంAhobilam: నరసింహ స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ కృష్ణ జయంతి వేడుకలు

Ahobilam: నరసింహ స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ కృష్ణ జయంతి వేడుకలు

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీ కృష్ణ జయంతి సందర్భంగా గురువారం స్వామి వారికి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని, శ్రీ దేవి భూదేవి అమ్మవార్లను, నవనీత కృష్ణ స్వామి వారిని ఆలయంలోని రంగ మంటపంలో కొలువుదీర్చి నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం శ్రీ కృష్ణ జనన మహోత్సవారాధన నిర్వహించి, స్వామివారికి శంఖుపాలను, వెన్నను, వివిధ రకాల భక్షణాలను నివేదించారు.
శ్రీ అహోబిల మఠంలో పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ శ్రీ మాలోల నరసింహ స్వామి వారికి, స్వామి రామనుజులు ఆరాధించిన శ్రీ కృష్ణ మూర్తికి అభిషేకం నిర్వహించి, శ్రీ మద్భాగవతంలో కృష్ణావతార ఘట్టమును పారాయణ చేసి, అనుగ్రహభాషణం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ మఠం ప్రతినిధి సంపత్, ఓఎస్ డి శివప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News