Saturday, November 23, 2024
HomeతెలంగాణSingireddy Niranjan Reddy: అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్లస్థలాలు

Singireddy Niranjan Reddy: అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్లస్థలాలు

ఇంటి స్థలాలతో పాటు జర్నలిస్ట్ లకు భవిష్యత్ లో గృహలక్ష్మి పథకం

జర్నలిస్ట్ జీవితం ఉన్నతమైనది .. అందరికీ ఆదర్శంగా పనితీరు ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి బండారునగర్ లో నిర్వహించిన జర్నలిస్ట్ మితృల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తే అంతిమశక్తి అని, ప్రముఖ రాజకీయ నేతలు బాల్ థాకరే, ఎల్ కె అద్వానీలు జర్నలిస్ట్ లే అని గుర్తు చేశారు. జర్నలిస్ట్ లు రాసిన వార్తలతో ప్రభుత్వాలే కూలిపోయాయనీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజల దృక్పధం మారిపోయిందనీ అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఒకటి రెండు మినహా మీడియా అంతా వ్యతిరేకించింది .. కానీ తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేక పోయాయనీ,
అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్లస్థలాలు, త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి ఇంటి స్థలాల పత్రాలు అందజేస్తాం అని అన్నారు. స్వంత ఇల్లు ప్రతి ఒక్కరి జీవిత కల, ఇంటి స్థలాలతో పాటు జర్నలిస్ట్ లకు భవిష్యత్ లో గృహలక్ష్మి పథకం కూడా వర్తింపజేస్తాం అని హామీ ఇచ్చారు. నా పరిధిలో పరిష్కారం అయ్యే జర్నలిస్టుల సమస్యలు అన్నీ పరిష్కరిస్తాను అని, దానికి మించిన సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను .. ప్రజల కోసం పనిచేయడం నా విధి అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం అని, ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్ రన్ కార్యక్రమానికి మీడియా మితృలు హాజరుకావాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ , నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి రీజినల్ ట్రాన్స్ పోర్ట్ సభ్యులు ఆవుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వనపర్తి జిల్లా వెల్డింగ్ అసోసియేషన్ తరపు నుండి వనపర్తి మంత్రి కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేరిన 100 మంది .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -


ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన వాల్మీకి సంఘం అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు బుచ్చన్న, కార్యదర్శి వెంకటయ్య, రజిత్, కుర్మయ్య కృష్ణయ్య, సూర్య నారాయణ, నగేష్, ఖాజా, రాజు, ఉత్తన్న, సురేష్, ఆంజనేయులు, కృష్ణయ్య, చిన్న ఆంజనేయులు గౌడ్, శరత్, రాములు, బల్ రెడ్డి శంకర్ తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య, బోయ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News