Friday, September 20, 2024
HomeతెలంగాణMulugu: పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Mulugu: పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

గ్రామాల్లో గిరిజన ప్రజలకు అవగాహన

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ఎస్సై, ఆర్ అశోక్ ఆధ్వర్యంలో, గిరిజన గ్రామాల్లో వివిధ భద్రత చర్యల అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ,సైబర్ నేరల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందని, దోపిడీ నేరస్తులు ఆర్థిక వెసులు బాటు కోసం హత్యలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, బ్యాంక్ ఖాతా దారుల నుండి డబ్బులు కాజేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సెల్ ఫోన్ల ద్వారా ఓటీపీలు మీ బ్యాంకు ఖాతా యొక్క వివరాలు అడిగినట్లయితే వెంటనే మా సమాచారం ఇవ్వలని అన్నారు, అలాగే గ్రామాలకు వచ్చే అపరిచిత వ్యక్తులు ఆశ్రయం కల్పించ వద్దని అసాంఘిక శక్తులకు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆదివాసీ గ్రామీణ యువత విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుకు రావాలని,ప్రభుత్వ అమలు పరుస్తున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు గిరిజన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు,ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా పోలీస్ శాఖ వారికి ఫ్రెండ్లీ పోలీస్ లా భావించి కోరాలని,ఎస్సై అశోక్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఆర్పిఎఫ్ బలగాలు మరియు సివిల్ పోలీస్ బృందాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News