Saturday, October 5, 2024
HomeతెలంగాణKorukanti Chander: 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మేల్యే

Korukanti Chander: 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన ఎమ్మేల్యే

కేసీఆర్ నేతృత్వంలో సింగరేణి సంక్షేమ కార్యక్రమాలు

ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో సింగరేణి సి అండ్ ఎండి శ్రీధర్ సహకారంతో రామగుండం నియోజకవర్గంలోని కార్మికుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆర్జీ-1 పరిధిలో సుమారు రూ.60 లక్షల విలువ గల అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే చందర్ భూమి పూజ చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో రూ.10 లక్షల విలువ గల ఆర్వో ప్లాంట్, 7వ డివిజన్లో రూ.10 లక్షల విలువ గల ఆర్వో ప్లాంట్, 29వ డివిజన్లో రూ.15 లక్షల విలువ గల సిసి రోడ్డు పనులు, గంగానగర్ లో రూ.25 లక్షలతో ఇంటేక్ వెల్ ఫిల్టర్ బెడ్ రెన్యువేషన్ పనులను ఎమ్మెల్యే చందర్ భూమి పూజ చేసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేయడమే బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా అని ఆయన తెలిపారు. కార్మిక సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత విషయంలో సింగరేణి సంస్థ శ్రద్ధ తీసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందించదగిన విషయమన్నారు. సింగరేణి సి అండ్ ఎండి శ్రీధర్ ను కలిసి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని సింగరేణి కార్మిక వాడలను అభివృద్ధి చేయాలని కోరగా, డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులతో మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నారని అన్నారు.

నియోజకవర్గ పరిధిలో ప్రజల అవసరాలను తీరుస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతోందని అన్నారు. కరోనా సమయంలో అభివృద్ధిలో కొంత జాప్యం జరిగినా, గడిచిన రెండేళ్లలో రామగుండం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఫిల్టర్ బెడ్ లో రూ.20 కోట్లతో ర్యాపిడ్ గ్రావిటీ సిస్టం ద్వారా సింగరేణి కార్మిక వాడల్లో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధమైందని అన్నారు. ఇందుకు కొంత సమయం పడుతుండడంతో ప్రజలకు స్వచ్ఛమైన మినరల్ వాటర్ ను అందించేందుకుగాను ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 3 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు కాగా, ప్రస్తుతం మరో రెండు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎల్బీనగర్, జవహర్ నగర్, పరశురాం నగర్ ఏరియాలు సింగరేణి ఆధీనంలో ఉన్నప్పటికీ మున్సిపల్ నిధులతోనే రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, తమ ఆధీనంలో ఉన్న కాలనీలలో రోడ్లు వేయాలని, ప్రజలకు మౌలిక వసతులను కల్పించాలని ఎమ్మెల్యే చందర్ సూచించారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు ఉన్నట్లయితే త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే చందర్ జిఎంను కోరారు.

వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, ఆర్జీ-1 జీఎం చింతల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు బొడ్డు రజిత రవీందర్, వేగోళపు రమాదేవి శ్రీనివాస్, ఇంజపురి పులేందర్, దొంత శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవితా సరోజినీ, కల్వచర్ల కృష్ణవేణి, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, చెరుకు బుచ్చిరెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు దామోదర్ ముదిగిరి మల్లేశం, దాసరి శ్రీనివాస్, టిఆర్ఎస్ నాయకులు నారాయణదాసు మారుతి, పర్లపల్లి రవి, తోడేటి శంకర్ గౌడ్, అచ్చ వేణు, జేవీ రాజు, తిరుపతి నాయక్, దొమ్మెటి వాసు, నూతి తిరుపతి, కలువల సంజీవ్, కాల్వ శ్రీనివాస్, తోకల రమేష్, వంగ వీరస్వామి, ఈదునూరి శ్రీకాంత్, పర్లపెల్లి బాబురావు, ఈదునూరి కిరణ్, చింటూ, జక్కుల తిరుపతి, అల్లం ఐలయ్య యాదవ్, బసవరాజు గంగరాజు, ముద్దసాని రంజిత్, దండు రవి, ఇరుగురాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News