Friday, September 20, 2024
HomeNewsAnjayya Yadav: భారీ మెజారిటీతో అంజన్ననే గెలిపించుకుంటాం

Anjayya Yadav: భారీ మెజారిటీతో అంజన్ననే గెలిపించుకుంటాం

అంజన్నకు మద్దతుగా స్థానికులు

ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సయ్యద్ హఫీజ్, మండల నాయకులు కార్యకర్తలు చింతకుంట, ముష్టిపల్లి, ఎదిర, కాసులబాద్ గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే అంజన్నని భారీ మెజారిటీతో గెలిపిస్తాయి అని గ్రామాల్లో కార్యకర్తలు, ప్రజలు తేల్చి చెప్పారు.
తాండలని గ్రామ పంచాయతీ చేసిన ఘనత, పలు గ్రామాలని నూతన గ్రామ పంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం, అంజన్న ఘనతే అని తెలిపారు.
గత ప్రభుత్వాలు చేయలేని అనేక పనులు, గ్రామాలకు బీటీ రోడ్లు, కాలనీల్లో సీసీ రోడ్లు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సయ్యద్ హఫీజ్ నాయకులు బంగారు రాములు, డైరెక్టర్ జబ్బార్ వెంకటేష్ పటేల్ బాబురావు, కొండి యాదయ్య, శివమౌళి, అంకం శేఖర్, బంగారు రాంచెంద్రయ్య, జహంగీర్ మల్లేష్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్ లు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News