కడ్తాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్. ఈసందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ మాట్లాడుతూ ..కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఎంబీసీల కోసం ప్రవేశపెట్టిన అతి పెద్ద పథకం ఎంబీసీల పథకం అన్నారు. కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు సంబంధించిన 186 బీసీ బంధు చెక్కులను ఆమనగల్లు మున్సిపాలిటీలో 26, మండలంలో 26 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అందజేశారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు రైతు బీమా, రైతుబంధు, దళిత బందు మైనార్టీ బంధు , బిసి బంధు, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఎలాంటి బ్యాంకులకు లింకు లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా ఇస్తున్నామన్నారు. అందరికీ ఒకేసారి ఇవ్వడం వీలు కాకపోవచ్చు కానీ రానివారికి మరొక విడుదలో విడతల వారీగా ప్రతి కుటుంబానికి వస్తుందని.. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని అలాగే గృహలక్ష్మి కూడా నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎంపీడీవో కార్యాలయం, స్త్రీ శక్తి భవనం, సీసీ రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల ఎంపీడీవోలు, కడ్తాల్ ఎంపీడీవో పాల్గొన్నారు.