Tuesday, October 1, 2024
HomeతెలంగాణTandur: మాణిక్ రావు జ్ఞాపకార్థం వీల్ చైర్లు బెడ్లు పంపిణీ

Tandur: మాణిక్ రావు జ్ఞాపకార్థం వీల్ చైర్లు బెడ్లు పంపిణీ

ముందు ముందు నిరుపేదల కోసం అనేక సేవలు

స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు 7వ వర్ధంతి సందర్భంగా విద్యా వికాస్ ట్రస్ట్ చైర్మన్ శశిప్రభ ఆధ్వర్యంలో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వీల్ ఛైర్స్, బెడ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిక్ రావు జ్ఞానపకర్ధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వివి ట్రస్ట్ తరపున వారి గుర్తులను స్మరిస్తూ వీల్ ఛైర్స్, బెడ్ లను అందజేశామన్నారు. నిరుపేదల కోసం ముందు ముందు అనేక సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదల నిమిత్తం వీల్ చైర్లు బెడ్లు పంపిణీ చేయడంతో ప్రజాప్రతినిధులు నిరుపేదలు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రధ్ పటేల్, విద్యా వికాస్ ట్రస్ట్ సభ్యులు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News