Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Social media youth: సోషల్‌ మీడియాతో యువత దారెటు

Social media youth: సోషల్‌ మీడియాతో యువత దారెటు

ఈ స్థితి ఇలాగే కొనసాగితే సమాజ పతనం పతాక స్థాయికి

నేటికాలంలో మారుతున్న శాస్త్రవిజ్ఞాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే మనిషి యొక్క జీవన విధానంలో అంతర్జాల మాధ్యమాల యొక్క ప్రభావం చాలా ఉన్నది. దీనిని పరిశీలిస్తే మనిషి కనీసం రోజుల్లో సగటు జీవితాన్ని మాధ్యమాలపై సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఇది మానవ జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఈ దిశలో ఆలోచిస్తే ఏది నిజం ఏది అబద్దం అనే విషయాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేని సందిగ్ధంలో సమాజం ఈ పరిస్థితిని ఎదుర్కుంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి ఏ విషయం అయినా కూడా ఈ రోజు తెలుసుకోవాలంటే సామాజిక మాధ్యమాలు ప్రధాన కీలకపాత్ర పోషిస్తున్నాయి. కానీ వాస్తవ విషయాలు కొన్ని మరుగునపడిపోతున్నాయి. కారణం అంతర్జాలంలో వివిధ రకాల అనేకమైనటువంటి సైట్లు నిజమైన విషయాన్ని అడ్డుకుంటున్నాయి. కారణం ఎవరి సైట్‌ను వారు డెవలప్‌ చేసుకోవాలనే ప్రయత్నం.
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాథమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల, సమాజాల యొక్క పరిశీలన, అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క జ్ఞానమును కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుసుకొనుట పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.
సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గము చరిత్రను కాలక్రమము (క్రోనాలజీ), హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగములతో సామాజిక శాస్త్రములలో భాగముగా వర్గీకరిస్తున్నారు.
ప్రజాచైతన్యమే మాధ్యమాల అక్రమాలకు విరుగుడు. మంచి కార్యక్రమాలను చూసి వాటిని ప్రోత్సహించాలి. ప్రజాసమస్యలను సమర్థవంతంగా వివరించి, విశ్లేషించి, పరిష్కరించడానికి ప్రయత్నించే మాధ్యమాలను ఆదరించాలి. ప్రజలకు ఉపయోగపడని వార్తలను, విషయాలను ప్రసారం చేస్తున్న మాధ్యమ సంస్థలను తిరస్కరించాలి. పత్రికలయితే చదవడం మానాలి. టివిలయితే చూడ్డం మానేయాలి. సంబంధిత బాధ్యుల దృష్టికి ఈ అక్రమాలను తీసుకుపోయి నిరసన తెలియజేయాలి. మన పూర్వీకులకున్న సామాజిక స్పృహ, రాజకీయ, ఆర్థిక, సాహిత్య, కళాది రంగాలపైన అధ్యయనం, ఒక స్పష్టమైన అవగాహన, అంచనా, పరిశీలన, అనుశీలనా కొరవడటమే ప్రస్తుత సమాజం తదనుగుణంగా మాధ్యమిక రంగం పతనమయిందని, ఈ స్థితి ఇలాగే కొనసాగితే ఈ సమాజ పతనం పతాక స్థాయికి చేరుతుందని పెద్దలు, ప్రత్యేకించి యువతరం గుర్తించాలి.
ఏది ఏమైనప్పటికీ అంతర్జాలంతో సగటు మానవుడికి శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంత సమాచారాన్ని తెలుసుకోవచ్చో అంతకంటే ఎక్కువగా నష్టాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీనిని గమనించాల్సింది. సరైన విషయాన్ని తెలుసుకోవాల్సింది వ్యక్తి స్వగతంపైనే ఆధారపడి ఉంటుంది. ఏ దిశగా విషయాన్ని అంతర్జాలంలో అన్వేషిస్తే ఆ దిశగానే వారికి ఫలితాలను సంపాదించుకోవచ్చు.

  • డాక్టర్‌ చిటికెన కిరణ్‌ కుమార్‌
    ప్రముఖ రచయిత, విమర్శకులు
    సభ్యులు, ఐ. బి. ఆర్‌. ఎఫ్‌
    9490841284
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News