Sunday, October 6, 2024
HomeతెలంగాణChagalamarri: పోలీసుల అదుపులో చాగలమర్రి టిడిపి నేతలు

Chagalamarri: పోలీసుల అదుపులో చాగలమర్రి టిడిపి నేతలు

ముందస్తు అరెస్టులతో స్టేషన్లో టిడిపి నాయకులు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి కోర్టు తీర్పు రిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర టిడిపి పార్టీ బంద్ పిలుపుమేరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీస్ ఎస్సై రమణయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా. అన్సర్ బాషా , తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నంద్యాల జిల్లా ఫోక్ పర్సన్ సల్లా నాగరాజు , కశినేని ఓబులేసు , అలాంసా గారి హనీఫ్ , టిడిపి నాయకులు , తదితరులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. సోమవారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ నేపథ్యంలో టిడిపి పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతున్న పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణ ఎస్ఐ రమణయ్య తమ సిబ్బందితో వాహన రాకపోకలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో వాహన రాకపోకలు , వ్యాపార సముదాయాలు కొనసాగాయి.ఎస్ఐ రమణయ్య మాట్లాడుతూ ఎక్కడ టిడిపి నాయకులు రోడ్డు ఎక్కిన నిరసనలు తెలిపిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు . టిడిపి పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా.అన్సర్ బాషా మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని వారు ఖండించారు. చాగలమర్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో నాయకులు తమ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను ముక్తకంఠంతో ఖండించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News