Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభSreeleela : షూటింగ్‌కి వెళ్లి స్పెయిన్‌లో బ్యాగ్ పోగొట్టుకున్న హీరోయిన్..

Sreeleela : షూటింగ్‌కి వెళ్లి స్పెయిన్‌లో బ్యాగ్ పోగొట్టుకున్న హీరోయిన్..

- Advertisement -

Sreeleela : పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది శ్రీలీల. ఏ ముహూర్తాన రాఘవేంద్రరావు చేతుల ద్వారా పరిచయమైందో కానీ ఆ సినిమా తర్వాత అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. రవితేజ సరసన శ్రీలీల నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా ధమాకా ప్రమోషన్స్ లో శ్రీలీల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. శ్రీలీల మాట్లాడుతూ.. పెళ్లి సందD సినిమా రిలీజ్ కాకముందే ధమాకా సినిమాకి ఓకే చెప్పాను. ఈ సినిమా షూట్ టైంలో చాలా మెమరీస్ ఉన్నాయి. స్పెయిన్ లో జింతాక పాట షూట్ కి వెళ్ళాం. అప్పుడు నా బ్యాగ్ పోయింది. నా కాస్ట్యూమ్స్ అన్ని అందులోనే ఉన్నాయి. దీంతో మేము ఉండే ప్లేసెస్ నుంచి చాలా దూరం వెళ్లి మా కెమెరామెన్, డైరెక్టర్ నా కోసం షాపింగ్ చేశారు అని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News