Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభComedian Ali : కడుపులో ఉన్న బిడ్డతో సహా మా అక్క కాలిపోయింది..

Comedian Ali : కడుపులో ఉన్న బిడ్డతో సహా మా అక్క కాలిపోయింది..

- Advertisement -

Comedian Ali : టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ సినిమాలతోనే కాక టీవీ షోలతో కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాడు. అలీ యాంకర్ గా అలీతో సరదాగా ప్రోగ్రాం వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి పలువురు సెలబ్రిటీలు వస్తుండగా అలీ తనదైన శైలిలో వాళ్ళతో మాట్లాడుతూ అనేక విషయాలని తెలియచేసేవాడు.

అలీతో సరదాగా ఇటీవలే 300 ఎపిసోడ్లు పూర్తి అవ్వగా చివరి ఎపిసోడ్ లో సుమనే అలీని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అలీ తన లైఫ్ లోని అనేక విశేషాలని తెలియచేసాడు. తన చిన్నప్పుడు జరిగిన ఒక విషాద సంఘటనని కూడా షేర్ చేసుకున్నాడు అలీ.

అలీ మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మా పెద్దక్క ఫాతిమా నన్ను బాగా చూసుకునేది. నేను షూటింగ్స్ కి వెళ్తే తనే దగ్గరుండి రెడీ చేసి పంపించేది. నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు అప్పటికే అక్కకి ఒక బాబు ఉన్నాడు, మళ్ళీ గర్భవతిగా ఉన్నప్పుడు పాలు వేడి చేస్తుంటే చున్నీకి మంట అంటుకొని మంటల్లో కాలిపోయింది. కాపాడదామని ప్రయత్నించారు కానీ కడుపు లోపల బిడ్డతో సహా కాలిపోయింది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. అందుకే తన పెద్ద కూతురికి వాళ్ళ అక్క మీద ప్రేమతో ఫాతిమా అని పేరు పెట్టుకున్నాను అని చెప్పాడు అలీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News