Saturday, November 23, 2024
HomeతెలంగాణPalakurthi: కాంగ్రెస్ నుంచి బిఆర్ ఎస్ లోకి

Palakurthi: కాంగ్రెస్ నుంచి బిఆర్ ఎస్ లోకి

అధికార పార్టీలోకి కొనసాగుతున్న వలసలు

వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పెరకవేడు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. వారికి పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని మంత్రి హామీ ఇచ్చారు. బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన పెరక వేడు గ్రామ కాంగ్రెస్ నాయకులలో గారే వెంకటేష్, గారే సుకుమార్, గారే వీరయ్య, గారే రామస్వామి, బిర్రు చంద్రయ్య, బిర్రు అంజి, గారే యాకయ్య, గారే సుమన్, గారే రాములు, గారే యాకూబ్, వేల్పుల శ్రీను, అయిత యాకయ్య, అయిత వీరస్వామి, నల్ల విష్ణు, గారే వీర స్వామి, వంగాల స్వామి, వంగాల సునీల్, గారే నారాయణ, ఆరూరి వెంకట సాయిలు, వేల్పుల యాక నారాయణ ఉన్నారు.

- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ లోకి వలసలు వెల్లువలా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న హనుమాండ్ల ఝాన్సీ సొంత గ్రామం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారంతా పాలకుర్తిలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో మంగళ వారం గులాబీ కండువాలు కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమంది నాయకులు కార్యకర్తలు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నా వారి సొంత గ్రామం నుంచే అనేకమంది బిఆర్ఎస్ పార్టీలో చేరుతుండటమే ఎందుకు నిదర్శనం అన్నారు. టిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ల తోనే భవిష్యత్తు ముడిపడి ఉందని మంత్రి తెలిపారు. బి ఆర్ ఎస్ లో చేరిన వాళ్లందరికీ తగిన గుర్తింపు గౌరవం ఇస్తామన్నారు వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం లో వి ఆర్ ఎస్ పార్టీ విజయం కోసం పనిచేయాలని వారికి సూచించారు. బి అర్ ఎస్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు పట్ల ఆకర్షితులమై తాము బి ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు భవిష్యత్తులో నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ విజయానికి పాటు పడతామని వారు ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ నుంచి బి ఆర్ ఎస్ లు చేరిన వారిలో చెర్లపాలెం కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎద్దు మల్లయ్య, మంచ బిక్షం, గజ్జి యాకయ్య, గాజు ఉప్పలయ్య, ఎద్దు అయిలయ్య, ఎద్దు వెంకన్న, ఎద్దు వెంకన్న (టైగర్), చెవుల వెంకన్న, చెవుల రమేష్, చెవుల సురేష్, మంచ శీను, మంచ రాములు, మంచ వెంకన్న, ఎద్దు కొమురయ్య, జక్కుల రాజమల్లు, ఎద్దుల లింగరాజు, జక్కుల వెంకన్న, గజ్జి నరసయ్య, గజ్జి అరువయ్య, మంచ శ్రీను, సంపెట్ట సూరి, నక్క యాదగిరి, నక్క మహేందర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News