Friday, September 20, 2024
HomeతెలంగాణSunke Ravi: మహిళా ఆరోగ్యం మా ప్రాధాన్యం

Sunke Ravi: మహిళా ఆరోగ్యం మా ప్రాధాన్యం

'ఆరోగ్య మహిళ' ప్రారంభం

ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యం ఉంటే ఇల్లు అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటి ఇంటికి మెరుగైన వైద్యం కెసిఆర్ కే సాధ్యమన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. చొప్పదండి రామడుగు మండల గోపాలరావుపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని సౌకర్యాలు ఎలా ఉన్నాయని పరిశీలించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య చిట్కాలపై చికిత్స అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని మహిళలు తప్పకుండా సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఒకప్పుడు పల్లెల్లో సర్కార్ దావకానకు వెళ్లాలంటే నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనే పాటలు పాడుకున్న రోజులు పోయి నేను బుల్లెట్ బండి ఎక్కి సర్కారు దావకానకు వస్తాను అన్న రోజులు వచ్చాయన్నారు.

- Advertisement -

తెలంగాణ రాక ముందు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే సౌకర్యాలు సరిగా లేవని అలాంటిది కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు మెడికల్ ఆసుపత్రి వైద్య సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి మంజూరు అని అన్నారు. రాష్ట్రంలోనే గజ్వేల్ తర్వాత చొప్పదండి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి సీఎం కేసీఆర్ వైద్యశాఖ మంత్రి హరీష్ రావులను ఒప్పించి తీసుకువచ్చానని అన్నారు.. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సంఖ్య పెరిగింది అన్నారు. ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి 13000 ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కర్రసత్య ప్రసన్నా రెడ్డి మాట్లాడుతూ గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్నారెడ్డి కలిగేటి కవిత లక్ష్మణ్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎడవల్లి నరేందర్ రెడ్డి పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి వైద్యులు కొండగట్టు ఆలయ డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చయ్య నాయకులు చాడ శేఖర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పైండ్ల శ్రీనివాస్ ఏఎన్ఎంలు ఆశా అంగన్వాడి కార్యకర్తలు వార్డు సభ్యులు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News