చాగలమర్రి మండలం చాగలమర్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర ) లో మధ్యాహ్న భోజనం పథకం కింద వడ్డిస్తున్న ఆహార నాణ్యతను ఆకస్మికంగా తనిఖీ చేశారు మండల అధ్యక్షులు రామిశెట్టి వీరభద్రుడు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మహ్మద్ రఫీ , చాగలమరి గ్రామ ఉపసర్పంచ్ మహమ్మద్ సోహెల్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ అబ్దుల్లా పాల్గొన్నారు. పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి భోజనం సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన శుచి, శుభ్రమైన భోజనము రోజుకొక రకమైన మెనూను ప్రకటించి విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలాగా మంచి నిర్ణయమని విద్యార్థులకు ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేశారు.
