Saturday, November 23, 2024
HomeతెలంగాణEmmiganuru: ఉమెన్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

Emmiganuru: ఉమెన్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ , ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో జిల్లా ఎస్పి కృష్ణకాంత్ పర్యటించారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పటు చేసిన ఉమేన్ హెల్ప్ డెస్క్ కార్యాలయంను అయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మిగనూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో పట్టణ సిఐ మధుసూదన్ రావు అధ్యక్షతన వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన పీస్ కమిటీ మీటింగ్ కు ఎస్పీ కృష్ణ కాంత్, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు హాజరైయ్యారు. ఈ సమావేశంలో ఎస్పీ, సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైనా వినాయక మండపల దగ్గర సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావలన్నారు. ప్రతి సంవత్సరం ప్రశాంతంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయని, అయితే ప్రతి సంవత్సరం 3 రోజుల జరిగే వినాయక చవితి వేడుకలు ఈ సారి 4 రోజుల పాటు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

ఈ సంవత్సరం కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సీతారామయ్య, తహసీల్దార్ ఆంజనేయులు, కమీషనర్ గంగిరెడ్డి, రూరల్ సిఐ మోహన్ రెడ్డి, మంత్రాలయం సిఐ శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐ మస్తాన్ వలి,రూరల్ ఎస్ఐ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్, కరెంట్ ఏడీ ,ఇరిగేషన్ డిఈ లక్ష్మన్ కుమార్, పీస్ కమిటీ సభ్యులు మల్లెల అల్ ఫ్రైడ్ రాజు, నరసింహులు,రామకృష్ణ ,తెలుగు రాముడు, దయాసాగర్,మధుబాబు,సునీల్ కుమార్, రియాజ్ అహమ్మద్, కాశీమ్ బేగ్, జైన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News