Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Omicron BF.7: కరోనా కొత్త వేరియంట్.. జర జాగ్రత్త!

Omicron BF.7: కరోనా కొత్త వేరియంట్.. జర జాగ్రత్త!

- Advertisement -

Omicron BF.7: కరోనా పుట్టిల్లు చైనా మరోసారి మహమ్మారితో వణుకుతోంది. ఇది అక్కడితో ఆగిపోదని, మళ్లీ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్లతో టీకాల ద్వారా లభించిన వ్యాధినిరోధకత నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. చైనాలో మరణమృదంగం మ్రోగిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 భారత్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో ఇప్పటి వారకు మూడు కేసులు నమోదు కాగా అందులో గుజరాత్ లోనే రెండు కేసులు, ఒడిశాలో ఒక కేసు వచ్చాయి.

కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రో.రాజారావు తెలిపారు. దేశంలో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండటంతో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అయితే.. భయం వద్దని అపోహలను నమ్మవద్దని అయన సూచించారు. గాంధీలో ప్రస్తుతం ఎనిమిది మంది కరోనా పేషేంట్లు ఉన్నారని.. అయితే వారెవరూ కొత్త వేరియంట్ సోకినవారు కాదన్నారు.

ప్రజలంతా మళ్ళీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.. కిడ్నీ, లివర్, డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ5కు చెందిన ఉపరకమే బీఎఫ్‌.7 కాగా.. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం కూడా ఉంది. దీని ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా చాలా తక్కువ. అంతేకాకుండా రీఇన్‌ఫెక్షన్‌ లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News